బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ ఆగిపోయింది. టెక్నికల్ గా ఏ ప్రాబ్లమ్ వచ్చిందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈషో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ లో లేదు. ఈ షోని తిరిగి గురువారం రాత్రి అంటే మార్చి 3వ తేదిన రాత్రి 12గంటల నుంచీ స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు, ఈ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ల ఏవిలు, వారి ఇంటర్య్వూస్ ని ప్రస్తుతం లైవ్ స్ట్రీమింగ్ లో టెలికాస్ట్ చేస్తున్నారు. ఇక ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్ ని ఫుల్ గా రాత్రి 9గంటలకి టెలికాస్ట్ చేస్తామని స్క్రోలింగ్ లో ప్రకటించింది బిగ్ బాస్ టీమ్.
ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షో నాన్ స్టాప్ లైవ్ హాట్ స్టార్ లో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, మొదటి నుంచీ దీనిని బిగ్ బాస్ లవర్స్ వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇన్ని గంటలు నాన్ స్టాప్ గా చూడాలంటే మాత్రం చాలా కష్టమని చెప్తూనే ఉన్నారు. అయినా కూడా బిగ్ బాస్ టీమ్ ప్రయోగాత్మకంగా ఈ షోని రన్ చేసింది. ఫస్ట్ వీక్ అస్సలు వ్యూవర్ షిప్ లేదు. అంతేకాదు, దీనిపైన సోషల్ మీడియాలో కూడా ఎక్కడా హడావుడి లేదు.
ముఖ్యంగా ఇంట్లో టెలివిజన్స్ చూసే వాళ్లు ఈషోని చూడలేకపోతున్నారు. అందుకే, ఇప్పుడు హాట్ స్టార్ లో 9గంటలకి ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసేందురు రంగం సిద్ధమైంది. మరి దీన్ని టెలివిజన్ లో కూడా ప్రసారం చేయబోతున్నారా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అయితే లైవ్ స్ట్రీమింగ్ ప్రసారాలని నిలిపివేశారు. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ ని తెలుగులో స్టార్ మాటివిలో కానీ, లేదా మా మ్యూజిక్ ఛానల్ లో కానీ ప్రసారం చేసే దిశగా టీమ్ ఆలోచనలు చేస్తోందని సమాచారం తెలుస్తోంది. ఇదే గనక జరిగితే బిగ్ బాస్ లవర్స్ కి పండగనే చెప్పాలి.