Bigg Boss Teugu 6: సుల్తానా, రేవంత్ లతో ఆడుకున్న గీతూ..! అసలు ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. ఫస్ట్ డే గీతురాయల్ తనకి కావాల్సిన స్క్రీన్ స్పేస్ ని తీస్కుని రెచ్చిపోయింది. అందర్నీ డామినేట్ చేస్తూ చిత్తూర యాసలో తనదైన స్టైల్లో మాట్లాడుతూ రెచ్చిపోయింది. మార్నింగ్ వాష్ రూమ్ లో జుట్టు ఎవరు పారేశారు అంటూ రెచ్చిపోయిన గీతూ చాలాసేపు తన తిక్కని చూపించింది. సుల్తానా స్నానం చేసిందని తెలిసి కాసేపు సుల్తానాతో ఆర్గ్యూమెంట్ చేసింది. అంతేకాదు, తిక్కది, తిక్కలపాప అంటూ నోరు కూడా జారింది.

మాటకి మాట చెప్పిన సుల్తానా, ఆ తర్వాత గీతుతో ఆర్గ్యూ చేయలేక సైలెంట్ అయిపోయింది. వాష్ రూమ్ లో హైయిర్ పారేస్తున్నారని, అది తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని గీతూ కంప్లైట్ చేసింది. అంతేకాదు, తనకి వాష్ రూమ్ క్లీనింగ్ వచ్చినా కూడా నేను వేరే వాళ్ల జుట్టు తీయను అంటూ బొచ్చు గురించి లొల్లి చేసింది. బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా క్లాస్ , మాస్, ట్రాష్ అనే మూడు తరగతులుగా హౌస్ మేట్స్ ని విభజించమని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ గీతూని ట్రాష్ లో వేశారు.

ట్రాష్ లో ఉన్నవారు నేరుగా నామినేట్ అవుతారని చెప్పాడు బిగ్ బాస్. దీంతో గీతూ కొంచెం ఫ్రస్టేట్ అయ్యింది.క్లాస్ టీమ్ లో బాలాదిత్యకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి. ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇంకా శ్రీహాన్ ఇద్దరూ కూడా క్లాస్ టీమ్ లో ఉన్నారు. వీళ్లు నేరుగా కెప్టెన్సీ పోటీదారులు అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే, ఇక్కడే ట్రాష్ టీమ్ ని విభజించేటపుడు సుల్తానా మరోసారి జుట్టు ఇష్యూ తీసింది. గీతూ అలా మాట్లాడటం నాకు నచ్చలేదని, వాష్ రూమ్ క్లీనింగ్ వచ్చినపుడు ఏదైనా కూడా శుభ్రం చేయాలని నేను చేయను అంటే కుదరదని నిక్కచ్చిగా చెప్పింది.

వాష్ రూమ్ లో నేను క్లీనింగ్ చేయాల్సి వస్తే అన్ని పనులు చేస్తానని చెప్పింది సుల్తానా. ఆ తర్వాత బిగ్ బాస్ ట్రాష్ టీమ్ లో ఉన్నవాళ్లకి ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా తమకి నచ్చినవాళ్ల పేరు పేపర్ పై రాసి బాటిల్ లో పెట్టి స్మిమ్మింగ్ పూల్ లోకి వదిలేయమని చెప్పాడు బిగ్ బాస్. అంతేకాదు, వాళ్ల సపోర్ట్ ఎలా ఉండేది. వాళ్ల గురించి మనసులో మాటని ఆడియన్స్ తో పంచుకోమని చెప్పాడు.

ఇక్కడే ట్రాష్ టీమ్ లో ఉన్న సుల్తానా తన ఫాదర్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది. గీతూ కూడా ఏడుస్తూ తర్వాత రేవంత్ ని వెళ్లమని గొడవ చేసింది. అటూ , ఇటూ తిరుగుతూ హడావుడి చేసింది. ఆ తర్వాత నేను ఈ స్టేజ్ వరకూ వచ్చానంటే అది నా ఫాలోవర్స్ వల్లే అని, వాళ్లకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానని చెప్తూ ఎమోషనల్ అయిపోయింది గీతూ.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus