బిగ్ బాస్ 4: అవినాష్ టెంపర్ తో ఆడుకున్న హారిక..!

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ఇస్తే హౌస్ మేట్స్ లెక్కలు అన్నీ మారిపోతాయి. ప్రస్తుతం నడుస్తున్న పల్లెకి పోదాం ఛలో ఛలో అనే టాస్క్ లో హారిక తనదైన స్టైల్లో సీక్రెట్ టాస్క్ ని కంప్లీట్ చేస్తోంది. పల్లెటూరి పోకిరి పిల్ల మల్లిగా అవతారం ఎత్తిన హారిక తర్వాత హంతకురాలిగా మారి మూడు హత్యలు చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటి హత్యని దిగ్విజయంగా పూర్తి చేసింది.

ఏదైతే అమ్మరాజశేఖర్ మాస్టర్ పైన కాఫీ చుక్కులు పోయాలో దాన్ని పూర్తి చేసింది. ఇక మిగిలింది రెండే రెండు. అవినాష్ కి కోపం తెప్పించి అరిచేలా చేయడం, అలాగే ఏదైనా విండోపైన తను చంపాలని అనుకున్న వ్యక్తి పేరు లిప్ స్టిక్ తో రాయడం. ఈ రెండూ కూడా హారిక ఫినిష్ చేసినట్లుగానే కనిపిస్తోంది. రీసంట్ గా వచ్చిన ప్రోమోలో అవినాష్ పాన్ డబ్బా దగ్గర రచ్చ రచ్చ చేసింది హారిక. రెండు పాన్స్ ఇస్తేనే కానీ కదలను అంటూ అవినాష్ టెంపర్ ని రెచ్చగొట్టింది.

తర్వాత అఖిల్ కూడా ఇందులో ఇన్వాల్ అయ్యేసరికి అవినాష్ కి బాగా కోపం వచ్చింది. గట్టిగా అరుస్తూ తన ప్రస్టేషన్ నీ తీర్చుకున్నాడు. అంతేకాదు, ఇక్కడే గట్టిగా అరవకు .. నాకు కూడా వస్తుంది అరవడం అంటూ హారిక నార్మల్ గా మాట్లాడేసరికి, అవినాష్ దీన్ని పర్సనల్ గా తీస్కుని ప్రస్టేట్ అయ్యాడు. ఇంకో మేటర్ ఏంటంటే, ఇక్కడ హారికతో పాటుగా అఖిల్ కూడా ఆవేశపడ్డాడు. అఖిల్ మద్యలో వచ్చాడు. దీంతో అఖిల్ కి, మెహబూబ్ కి , అవినాష్ కి కూడా ఘర్షణ అవుతోంది. హారిక వేసిన ప్లాన్ కి అఖిల్ ఇప్పుడు ఇన్వాల్ అవ్వడం అనేది చూస్తుంటే, ఈ స్టోరీ ఎక్కడ వరకూ వెళ్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక హారిక సెకండ్ సీక్రెట్ టాస్క్ కూడా దీంతో కంప్లీట్ చేసినట్లుగానే కనిపిస్తోంది. మూడో టాస్క్ కూడా ఈజీగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తుందనే అనిపిస్తోంది. సో, ఈవారం కెప్టెన్సీ రేసులో అమ్మరాజశేఖర్ తో పాటుగా హారిక ఉండబోతోందన్నమాట. అదీ మేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus