అంతలా కలిసుంటే.. ఇంతలా అంటారమ్మా?

‘ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన్న… ఏరు దాటాక బోడి మల్లన్న’ ఈ సామెత మీకు తెలుసా.. ఒకవేళ దీనినే మోడరన్‌గా చెప్పాలంటే ‘బిగ్‌బాస్‌లో ఉన్నంత వరకు అఖిలూ.. బయటికొచ్చాక అఖిల్‌ ఆ’ అనొచ్చేమో. అలా మారిస్తే ఈ సామెత మోనాల్‌కు సరిగ్గా సరిపోతుంది. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో మోనాల్‌ అన్ని రోజులు ఉందంటే ఒక రకంగా అఖిలే కారణం. మంచికో, చెడ్డకో, తిట్టుకునో, హగ్గులు ఇచ్చుకునో ఇద్దరూ ఆఖరి వరకు ఉన్నారు. అయితే ఇప్పుడు బయటికొచ్చాక అఖిల్‌ ప్రస్తావన తెస్తే మోనాల్‌కు తెగ చిరాకు వచ్చేస్తోంది.

హీరోయిన్‌గా పూర్తిగా డోర్లు మూసుకుపోయిన సమయంలో బిగ్‌బాస్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్లో కళ్లలో పడింది మోనాల్‌ గజ్జర్‌. తొలుత ఏడుస్తూ నర్మద అనిపించుకున్నా, తన అందంతో, ఆటతో, అఖిల్‌ సాయంతో నిలదొక్కుకుంటూ వచ్చింది. ఎంత గొడవపడినా, అలిగినా.. అఖిల్‌ ఆఖరికి మోనాల్‌ తరఫునే ఉండేవాడు. చాలా సందర్భాల్లో ఆమెకు సపోర్టు చేశాడు. కొన్నిసార్లు చేయలేదు కూడా. దీంతో ఇద్దరినీ కలిపే అందరూ మాట్లాడారు. అందుకు తగ్గట్టుగానే వాళ్లు కూడా లవర్స్‌ లాగే మెలిగారు. తొలుత అభిజిత్, అఖిల్‌తో ఈమె నడిపిన కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అభిజిత్‌ మధ్యలో బ్రేక్‌ అయినా అఖిల్‌తో వ్యవహారం బాగానే నడిచింది.

ఇంటి నుంచి బయటికొచ్చాక మోనాల్‌ బాగా బిజీ అయిపోయింది. ఓ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఇప్పుడు ఓ షోకి జడ్జ్‌గా చేస్తోంది. అయితే ఈ క్రమంలో ఆమె ఎక్కడికెళ్లినా అఖిల్‌ ప్రస్తావన వస్తోందట. ఇటీవల మోనాల్‌ సొంత రాష్ట్రం గుజరాత్ వెళ్లి వచ్చింది. ఆ సమయంలో ఎయిర్‌ పోర్ట్‌ లో ఆమెను చాలా మంది అఖిల్‌ గురించి అడిగారట. కొందరైతే ఆమె ఎదురుగానే ‘అఖిల్‌’ అంటూ అరిచారట. ఈ వ్యవహారంలో మోనాల్‌కు చాలా కోపం వచ్చిందట. ‘‘బయటకు వచ్చాక కూడా మేము ఇద్దరం కలిసి ఉంటున్నామని కొందరు అనుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు. అఖిల్‌ వాళ్ల ఇంట్లో ఉన్నాడు. నేను వేరే ఉన్నాను’’ అంటూ మోనాల్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. అంతగా బిగ్‌బాస్‌ ఇంట్లో కలిసి తిరిగారు కదా.. బయటికొచ్చాక అడిగితే కోపమెందుకు ‘నర్మద’.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus