బిగ్ బాస్ 4: నోయల్ సెటైర్… అవినాష్ ఫైర్..!

బిగ్ బాస్ హౌస్ లో నుంచి అనూహ్యంగా అవుట్ అయిన నోయల్ తన మనసులో మాటల్ని నాగార్జున ద్వారా స్టేజ్ పైన షేర్ చేస్కున్నాడు. హౌస్ మేట్స్ ని పలకరిస్తూనే తనని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు అనుకున్న అవినాష్ ని అమ్మరాజశేఖర్ మాస్టర్ ని ఒంటికాలుపై నించోబెట్టి మరీ కడిగేశాడు. ఇక్కడ నోయల్ ఆవేశంతో వీరిద్దరికీ క్లాస్ పీకాడు. కాలు నొప్పితో ఎంతో బాధపడుతుంటే నా బాధని మీరు ఎగతాళి చేయడం అస్సలు నచ్చలేదని తనదైన స్టైల్లో అడిగాడు. ఇక్కడే మిగతా హౌస్ మేట్స్ ని పొగుడుతూ వాళ్లకి ఆల్ ద బెస్ట్ చెప్తూ వీరిద్దరికీ క్లాస్ పీకేసరిని అమ్మరాజశేఖర్ మాస్టర్, అవినాష్ ఇద్దరూ కూడా తట్టుకోలేకపోయారు.

కామెడీ చేయడమే తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నావ్ అని, అలా అయితే నువ్వు చేసింది కూడా మేము హర్ట్ అయ్యాము అని తమని తాము డిపెండ్ చేస్కున్నారు. వెళ్లిపోతున్నావ్ కదా అని నువ్వు ఏదంటే అది మాట్లాడితే కరెక్ట్ కాదని ఒకవేళ నువ్వు హర్ట్ అయి ఉంటే అప్పుడు ఎంజాయ్ చేసి ఇప్పుడు నిలదీయడం కరెక్ట్ కాదని అవినాష్ అన్నాడు. అంతేకాదు, కావాల‌ని ఇద్ద‌రినీ బ్యాడ్ చేస్తున్నావని ఇది కరెక్ట్ కాదని అన్నాడు అవినాష్. చిల్లరకామెడీలు చేస్తే నేను ఇక్కడి వరకూ రాను అని, ప్రేక్షకుల ముందు మమ్మల్ని బ్యాడ్ చేయద్దని అన్నాడు.

ఆవేశంతో ఊగిపోయినా కూడా తర్వాత నావల్ల నువ్వు హర్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా సారీ అంటూ మోకరిల్లి మరీ సారీ చెప్పాడు అవినాష్. అయినా కూడా నోయల్ కనికరించలేదు. ఇక్కడ ఇద్దరిలో తప్పెవరిది అని అంటే, నోయల్ అడగడం తప్పు కాదు.. కానీ అడిగిన విధానం తప్పుగా ఉంది. అలాగే వేరేవాళ్ల బాధని హేళనగా చూసి జోకులు వేయడం కూడా తప్పే. అయితే, అది ఏ టైమ్ లో ఎలా చేశాడు.. ఎందుకు చేశాడు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఆ వీడియోలు బిగ్ బాస్ టీమ్ రిలీజ్ చేస్తే కానీ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది తెలియదు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus