బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి ఇది అవమానమే!

‘బ్లాక్ ఫ్రైడే’, ‘దేవ్ డి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సీపూర్’, ‘ద‌ట్ గ‌ర్ల్ ఇన్ ద ఎల్లో బూట్స్’ ఇలా ఎన్నో హిట్టు సినిమాలతో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు అనురాగ్ కశ్యప్. తక్కువ సినిమాలతోనే గొప్ప దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో అతడు కూడా ఒకడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే చాలా ఏళ్లుగా ఆయనకు సరైన కమర్షియల్ హిట్ మాత్రం రాలేదు. అతడు తీసే కథలు మాస్ ఆడియన్స్ కి పెద్దగా నచ్చవు. ఆయన సినిమాలకు థియేటర్లు కూడా సరిగ్గా నిండవు.

ఈ మధ్యకాలంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న దర్శకుల్లో అనురాగ్ కశ్యప్ ఒకరు. గతేడాది తాప్సీ పన్నుతో ఆయన తీసిన ‘దొబారా’ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన రీసెంట్ గా ‘ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహ‌బ్బ‌త్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. యంగ్ బ్యూటీ ఆలయా మెయిన్ లీడ్ పోషించిన సినిమా ఇది.

ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా అనురాగ్ స్టైల్ లో కొంచెం వెరైటీగా సాగుతుంది. శుక్రవారం నాడు రిలీజైన ఈ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అయిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సినిమా టాక్ కూడా ఏమంత పాజిటివ్ గా లేదు. ఒకప్పుడు అనురాగ్ కశ్యప్ సినిమాలు మొదటిరోజు కోట్లు వసూలు చేసేవి. కానీ ఇప్పుడు కనీసపు కలెక్షన్స్ కూడా రావడం లేదు. ట్రేడ్ లెక్కల ప్రకారం..

ఈ సినిమా తొలిరోజు కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మొదటిరోజే పరిస్థితి ఇలా ఉందంటే ఇక ఈ సినిమాకి లాంగ్ రన్ కష్టమే అనిపిస్తుంది. కనీసం రిలీజ్ ఖర్చులైనా వెనక్కి వస్తాయో లేదో మరి!

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus