Mahesh Babu: ట్విట్టర్లో మహేష్ బాబుని ఫాలో అవుతున్న బిల్ గేట్స్?

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుడుగా పేరు సంపాదించుకోవడమేకాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. చాలామంది ఈయనని కలిస్తే చాలు అని భావిస్తూ ఉంటారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఈయన ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చేశాయి. ఇలా మైక్రోసాఫ్ట్ అధినేతగా బిల్ గేట్స్ గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నారు. ఇలా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్నటువంటి బిల్ గేట్స్

ఒక టాలీవుడ్ హీరోని ఫాలో అవుతున్నారు అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.. బిల్ గేట్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును ట్విట్టర్ లో ఫాలో కావడం విశేషం. ఈ విధంగా బిల్ గేట్స్ మహేష్ బాబుని ట్విట్టర్లో ఫాలో అవుతున్నారని తెలియగానే మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే న్యూయార్క్ పర్యటనలో భాగంగా మహేష్ బాబు నమ్రత బిల్ గేట్స్ ను కలిసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే బిల్ గేట్స్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఏకంగా ఈయన ట్విట్టర్లో ఫాలో అవుతున్నారని తెలియడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేవు. ప్రపంచంలో ఎంతో మంది ప్రముఖులు ఉండగా బిల్ గేట్స్ కేవలం ట్విట్టర్ వేదికగా 433 మందిని ఫాలో అవుతున్నారు. వీరిలో మహేష్ బాబు ఒకరు. ఇకపోతే బిల్ గేట్స్ ను మహేష్ బాబును కలవడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇక వీరిద్దరి ఆలోచనలు కూడా కొన్ని విషయాలలో ఒకేలా ఉన్నాయి. పేదల కోసం బిల్ గేట్స్ ఏకంగా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపించి పేదరిక నిర్మూలన, వైద్య విద్య వంటి సదుపాయాల కోసం 100 కోట్ల డాలర్స్ ఈ ఫౌండేషన్ కు విరాళంగా ప్రకటించారు. మహేష్ బాబు సైతం నిరుపేదల చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఎంతో మందికి ప్రాణదానం చేశారు. ఏది ఏమైనా మహేష్ బాబును బిల్ గేట్స్ ఫాలో అవుతున్నారనే విషయం మహేష్ అభిమానులను ఎంతో సంతోషానికి గురి చేసింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus