Bindu Madhavi: ఈవారం ఎలిమినేషన్ అయ్యేది ఆమెనా ? కారణాలు ఏంటి ?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఈసారి ఎలిమినేషన్ అనేది నాటకీయంగా ఉండబోతోందా అంటే నిజమే అనిపిస్తోంది. ఈవారం నామినేషన్స్ లో మనం చూసినట్లయితే.., యాంకర్ శివ, అరియానా, తేజస్వి, అనిల్ రాధోడ్, మిత్రా శర్మా, స్రవంతి ఇంకా బిందుమాధవిలు ఉన్నారు. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ని చూసినట్లయితే వీళ్లలో బిందు మాధవి టాప్ పొజీషన్ లో ఓటింగ్ ని ప్రభావితం చేసింది. ఏకంగా 40శాతం ఓటింగ్ ని సంపాదించింది.

Click Here To Watch NOW

ఫుల్ తన డామినేషన్ ని చూపించింది. లాస్ట్ వీక్ కంటే కూడా 10శాతం ఓటింగ్ ని పెంచుకుంటూ వెళ్లింది. ఇది బిందు మాధవి ఓటింగ్ ప్రభంజనంగా చెప్పచ్చు. ముఖ్యంగా అఖిల్ యాంటీ ఫ్యాన్స్ అలాగే బిందుమాధవి ఫాలోవర్స్ అందరూ ఓటింగ్ చేయడంతో రాకెట్ లా దూసుకుపోతోంది. బిందు ఇంకా అఖిల్ ఇద్దరూ ఇలాగే గనక కొన్ని వారాలు ఉంటే ఫినాలేలో వీళ్లిద్దరి మద్యలోనే టఫ్ ఫైట్ అనేది ఉండబోతోంది.

ఇక యాంకర్ శివ కూడా సెకండ్ పొజీషన్ లో సేఫ్ జోన్ లో ఉన్నాడు. యాంకర్ శివ తర్వాత అరియానా గ్లోరీ ఉంది. అరియానా గ్లోరీకి చాలా వరకూ ఓటింగ్ అనేది డ్రాప్ అయ్యింది. ముఖ్యంగా గత వారాలతో పోలిస్తే అరియానాకి ఓటింగ్ పర్సెంటేజ్ బాగా తగ్గిపోయింది. ఇలాగే ఉంటే గనక ఖచ్చితంగా అరియానాకి మైనస్ అవుతుంది. టాప్ 5కి కూడా రావడం కష్టంగానే మారుతుంది. మరోవైపు డేంజర్ జోన్ నుంచీ కొద్దిగా బయటపడింది తేజస్వి.

సీజన్ 2లో నెగిటివిటీని మూట గట్టుకుని హౌస్ నుంచీ బయటకి వచ్చిన తేజస్వి, ఇప్పుడు ఈ సీజన్ లో గేమ్ చాలా బాగా ఆడుతోంది. తేజస్వి ని గేమ్ లో చూసినవాళ్లందరూ కూడా గేమ్ నచ్చి ఓట్లు వేస్తున్నారు. ఈవారం సేఫ్ జోన్ లో ఉంది తేజు. ఇక ముగ్గురి మద్యలోనే ఎలిమినేషన్ అనేది ఉండబోతోంది. మిత్రా శర్మా, స్రవంతి, ఇంకా అనిల్ రాథోడ్. మిత్రాతో పోలిస్తే అనిల్ రాధోడ్ ఇంకా స్రవంతి ఇద్దరూ కూడా బాగా డేంజర్ జోన్ లో ఉన్నారు.

అనూహ్యంగా ఈవారం స్రవంతి నామినేషన్స్ లోకి వచ్చింది. అంతేకాదు, టాస్క్ ల పరంగా కానీ, వేరే విధంగా కానీ , కంటెంట్ జనరేట్ చేసే విధానంలో కానీ స్రవంతి చాలా వీక్ గా ఉంది. మరి అనిల్ రాథోడ్ , స్రవంతి ఇద్దరిలోనే ఎలిమినేషన్ జరిగితే స్రవంతి ఎలిమినేట్ అవ్వక తప్పదు అన్నట్లుగానే అనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus