బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం ద్వారా మొదటి సారిగా ఒక మహిళా కంటెస్టెంట్ విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమం ద్వారా గెలుపొందిన బిందు మాధవికి ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించిన బిందు మాధవికి అనంతరం అవకాశాలు తగ్గిపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లారు.అక్కడ కూడా తనకు అవకాశాలు రాకపోవడంతో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక ఆ కార్యక్రమంలో విజయం సాధించాలని బిందుమాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం ద్వారా విజేతగా నిలిచారు.
ఇక ఈమె విజేతగా నిలవడంతో తనకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో బిందుమాధవి కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా కోసం ఈమె రెమ్యూనరేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒక్కో సినిమాకు 25 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బిందుమాధవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెండింతలు రెమ్యూనరేషన్ పెంచి ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమెకు వరుస అవకాశాలు రావడంతో ఇలా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బిందుమాధవి బిగ్ బాస్ విజేతగా నిలవగా తనకు భారీగానే పారితోషికం వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 40 లక్షల ప్రైస్ మనీతో, తన రెమ్యూనరేషన్ కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా బిందుమాధవి ఈ కార్యక్రమంలో మొదటి నుంచి టైటిల్ రేసులో ఉంటూ టైటిల్ కోసం పోరాడుతూ చివరికి అనుకున్నది సాధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. ఇలా బిగ్ బాస్ విన్నర్ కావడంతో తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది.