Bindu Madhavi, Balakrishna: బిగ్ బాస్ విన్నర్ కు స్టార్ డైరెక్టర్ బంపరాఫర్!

  • May 25, 2022 / 02:34 PM IST

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు ఆమె టైటిల్ విన్నర్ గా నిలుస్తుంది అని ప్రేక్షకులు ముందుగానే ఊహించారు. ఆమెకు పోటీగా అఖిల్ ఉన్నప్పటికీ కూడా చివరి వరకు చాలా బలంగా పోరాడిన బిందుమాధవి అనుకున్నట్లే విజేత గా నిలిచి మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఇక ఆమె ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా స్థిరపడాలని ఆలోచన చేస్తోంది.

ఇదివరకే బిందుమాధవి కొన్ని మీడియం రేంజ్ సినిమాలతో మంచి నటిగా క్రేజ్ అందుకుంది కానీ ఇంకా స్టార్ హీరోయిన్ గా మాత్రం ఆమెకు క్రెడిట్ అయితే దక్కలేదు. ఇక నెక్స్ట్ తన కెరీర్ విషయంలో ఆమె మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని అనుకుంటుంది. ఇక ఆమెకు బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో స్టార్ దర్శకుడు ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఇవ్వడం విశేషం. దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ క్7 ప్రత్యేక అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం F3 సినిమా విడుదలకు సిద్ధమైంది అని ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాను అని చెప్పారు. ఇక నాగార్జున అప్పుడే ఈ సినిమాలో బిందుమాధవి ఉంటుందా అని అడగడంతో తప్పకుండా ఉంటుంది అని అనిల్ రావిపూడి వివరణ ఇవ్వడం విశేషం. అయితే ఇంకా స్క్రిప్ట్ సిద్ధం కాలేదు కానీ బిందు మాధవి కోసం ఒక రోల్ ఉంటుంది అని ఆయన చెప్పారు.

నాగార్జున కూడా ఆ విషయంలో ఎంతగానో సంతోషించాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ నటీమణి దివికి కూడా ఒక ప్రత్యేకమైన ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. బోళా శంకర్ సినిమాలో ఆమె చిరంజీవితో నటించనుంది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా అదే తరహాలో బిందుమాధవి కి బాలయ్య సినిమాలో అవకాశం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ అవకాశంతో బిందుమాధవి ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus