Bindu, Ajay: కెప్టెన్సీ టాస్క్ లో బిందు ఫుల్ ఫైర్.! అఖిల్ పై దూసుకెళ్లిన బిందు..! అసలు ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ కెప్టెన్సీ టాస్క్ తో వేడెక్కింది. పోటీదారులు అందరూ కీలుగుర్రం టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సంచాలక్ అయిన అరియానా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తోంది. బెల్ కొట్టిన వాళ్లు గుర్రంపై ఉన్నవారికి జ్యూస్ తాగించి మరీ సంచాలక్ తో ఎలిమినేట్ చేయమని కోరుతున్నారు. ఈ క్రమంలో నటరాజ్ మాస్టర్, అజయ్, ఇంకా యాంకర్ శివ మాత్రమే మిగిలారు. నైట్ ఎండ్ అయిన ఈ టాస్క్ మార్నింగ్ స్టార్ట్ అయ్యింది.

Click Here To Watch NOW

ఇక్కడే బిందుమాధవి యాంకర్ శివకి సపోర్ట్ చేస్తుంటే, అఖిల్ అజయ్ కి సపోర్టింగ్ గా నిలబడ్డాడు. ఇద్దరి మద్యలో గట్టి యుద్ధమే జరిగింది. రీసంట్ గా రిలీజైన ప్రోమోలో చూస్తుంటే బిందుమాధవి అఖిల్ పై ఫుల్ ఫైర్ అయ్యింది. యాంకర్ శివ దగ్గర చేరిన హౌస్ మేట్స్ కిందకి దింపే ప్రయత్నం చేస్తుంటే బిందుమాధవి అఖిల్ తో వాగ్వివాదానికి దిగింది. నిజానికి అఖిల్ శివతో మాట్లాడేటపుడు నీ ఫ్రెండ్ నే చూడవ్ నువ్వు ఇక మమ్మల్ని క్యాప్టన్ గా ఏం చూస్తువ్ అంటూ ప్రశ్నిస్తూ మాట్లాడాడు.

ఇక్కడే బిందుమాధవి అసలు మీరు ఆ క్యాటగిరిలోనే లేరు అంటూ మాట్లాడింది. దీంతో అఖిల్ బిందుని అసలు మీరు పోటీదారులు ఎన్నిసార్లు అయ్యారు అని అడిగితే , నేను ఫాలోవర్స్ రాక అవ్వలేదు అంటూ చెప్పింది బిందు. అంతేకాదు, నన్ను ఫస్ట్ లోనే టార్గెట్ చేసారంటూ మాట్లాడింది. దీంతో అఖిల్ కి బిందుకి మద్యలో మాట మాట పెరిగింది. నేనెప్పుడు సేఫ్ గా ఆడను అంటూ అఖిల్ అనేసరికి, బిందు అసలు నువ్వు ఏది ఆడవ్ అంటూ రెచ్చిపోయింది.

నువ్వు ఆడుతున్నావా అంటే నువ్వు ఆడుతున్నావా అంటూ ఇద్దరూ రెచ్చిపోయారు. ఇక్కడే అఖిల్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఇక్కడ వీళ్లతో నేను మాటలు పడటానికి రాలేదంటూ బాధపడ్డాడు. ఇంకాస్త ముందుకెళ్లిన బిందు, నువ్వు అందర్నీ పోగేసుకుని ఫ్రెండ్స్ అంటూ గేమ్ ఆడతావ్ అంటూ రెచ్చగొట్టింది. ఫ్రెండ్స్ సపోర్ట్ తో బతుకుతుంది నువ్వు నేను కాదు అంటూ గట్టిగా చెప్పింది. దీంతో అఖిల్ బాగా ట్రిగ్గర్ అయిపోయాడు. ఇదే టైమ్ లో వచ్చిన అజయ్ నావల్ల వాడు బతుకుతున్నాడు అని చెప్పావ్ , నా వల్ల వాడు బతకడం లేదు అంటూ రెచ్చిపోయాడు. బిందుపైకి ధ్వజమెత్తాడు.

దీంతో అజయ్ కి సైతం సమాధానం చెప్పింది బిందు. ఇక్కడే ఆవేశపడిన అజయ్ మాటలు పెంచాడు. గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడాడు. దీంతో బీప్ సౌండ్స్ కూడా పడ్డాయి. ఇక్కడ బిందుని అజయ్ బూతులు తిట్టాడా అన్నట్లుగా మారింది పరిస్థితి. ఇక నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అంటూ స్ట్రయిట్ గా బిందు అజయ్ పైకి వచ్చింది. మరి ఈ గొడవ ఎంతవరకూ వెళ్లింది. నటరాజ్ మాస్టర్ ఇంకా శివల్లో ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకూ ఆగాల్సిందే. అదీ మేటర్.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus