B Gopal, Balakrishna: బాలయ్య సీక్రెట్స్ చెప్పేసిన ప్రముఖ దర్శకుడు!

స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయనే విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ లో మొత్తం ఐదు సినిమాలు తెరకెక్కగా నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిస్తే ఒక సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. పలనాటి బ్రహ్మనాయుడు సినిమా తర్వాత బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బి.గోపాల్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

బాలయ్యకు కోపం ఎక్కువని అందరూ అయితే బాలయ్య అందరితో సరదాగా ఉంటారని బి.గోపాల్ అన్నారు. ఉదయం 7 గంటలకు షాట్ అని చెప్పి టిఫిన్లు, కాఫీలు అంటూ లేట్ చేస్తే మాత్రం బాలయ్యకు అస్సలు నచ్చదని ఆ సమయంలో బాలయ్యకు కోపం వస్తుందని బి.గోపాల్ చెప్పుకొచ్చారు. లారీ డ్రైవర్ మూవీ షూటింగ్ టైమ్ లో కొన్ని సీన్లను రీషూట్ చేయాల్సి వచ్చిందని బి.గోపాల్ అన్నారు. ఆ సమయంలో ఎందుకు రీషూట్లు చేస్తున్నామో బాలయ్యకు సరిగ్గా చెప్పలేదని బి.గోపాల్ పేర్కొన్నారు.

కారణం చెప్పకుండా రీషూట్లు చేయడంతో బాలకృష్ణకు కోపం వచ్చిందని బి.గోపాల్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత పరుచూరి గోపాలకృష్ణ బాలయ్యకు వివరించి చెప్పగా ఆయన అర్థం చేసుకున్నారని బి.గోపాల్ పేర్కొన్నారు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమాలు 100 రోజులు ఆడాయని సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలు 100 సెంటర్లలో 100 రోజులు ఆడాయని బి.గోపాల్ వెల్లడించారు. బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus