Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం : ‘నో దంగల్.. సెలబ్రేట్ పొంగల్’.. వెంకీ ఎలా పాడాడంటే..?

వెంకటేష్ (Venkatesh)  ,  అనిల్ రావిపూడి (Anil Ravipudi)  కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) . గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’ (F2 Movie) బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘ఎఫ్ 3’ (F3 Movie)  కూడా పర్వాలేదు అనిపించేలా ఆడింది. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. పోటీగా ‘గేమ్ ఛేంజర్'(Game Changer), ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) వంటి సినిమాలు కూడా వస్తుండటంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) ప్రమోషన్స్ డోస్ పెంచారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు వదిలారు.

Sankranthiki Vasthunam

రెండు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాటను కూడా రిలీజ్ చేశారు. భీమ్స్ (Bheems Ceciroleo)  ఈ సినిమాకి (Sankranthiki Vasthunam) సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ‘హె కొక్కొరొకో కోడి కూడా జనవరి చలి పులి దెబ్బకి ఎంతలేసి వణికిందో ఏ మూల పండుకుందో’.. అంటూ ఈ పాటని మొదలుపెట్టాడు భీమ్స్. ఆ తర్వాత ‘గొబ్బీయల్లో గొబ్బీయల్లో పండగొచ్చే గొబ్బీయల్లో ఎవ్రీబడీ గొబ్బీయల్లో’ అంటూ రోహిణి ఎంతో ఎనర్జిటిక్ గా ముందుకు తీసుకెళ్లింది.

అటు తర్వాత ‘బేసికల్లి టెక్నికల్లి లాజికల్లి ప్రాక్టికల్లి’ అంటూ వెంకటేష్ ‘ఇట్స్ ఎన్ ఆటిట్యూడ్ పొంగలు’ అంటూ ఎనర్జిటిక్ గా పాటని ఆలపించడం జరిగింది. ఈ పాటని హుషారెత్తించే విధంగా పాడటమే కాకుండా.. ఇద్దరు హీరోయిన్లు అయినా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh)..లతో ఎనర్జిటిక్ చిందులు కూడా వేశాడు వెంకటేష్. సంక్రాంతి పండుగకి హైలెట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పాటని వదిలినట్టు ఉన్నారు. పల్లెటూర్లలో ఈ పాట మార్మోగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

2025 కి వెల్కమ్ చెప్పబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus