‘బ్లఫ్ మాస్టర్’ కు లాంగ్ వీకెండ్ కలిసొచ్చినట్టే..!

ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యి ‘ముకుంద’ ‘జ్యోతిలక్ష్మి’ ‘ఘాజీ’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘అంతరిక్షం’ వంటి చిత్రాలతో హీరోగానే కాకుండా నటుడుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్‌. ఇప్పుడు ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రంతో ఫుల్ లెంగ్త్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సత్యదేవ్.’చతురంగ వేట్టై’ అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘శ్రీదేవి మూవీస్ సంస్థ’ అధినేత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు కాగా ‘అభిషేక్ ఫిలిమ్స్’ అధినేత ర‌మేష్ పిళ్లై నిర్మాతగా వ్యవహరించారు.

మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఉత్తమ్ కుమార్ పాత్రలో ‘సత్యదేవ్’ నటనకు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క సుమంత్ ‘ఇదంజగత్’.. మరో పక్క రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’ సినిమాల గట్టి పోటీ మధ్య విడుదలైన ‘బ్లఫ్ మాస్టర్’ కు మంచి కలెక్షన్లను రాబడుతూ ట్రేడ్ ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ చిత్రాన్ని పెద్ద నిర్మాణ సంస్థలు పంపిణీ చేయడంతో ఎక్కువ థియేటర్లలోనే ‘బ్లఫ్ మాస్టర్’ ప్రదర్శితమవుతుంది. నందితా శ్వేతా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతమందించాడు. ఈ చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా రావడం విశేషం. లాగ్ వీకెండ్ కావడం అలాగే న్యూ ఇయర్ హాలిడే కూడా ఉండటంతో ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రం మంచి కలెక్షన్లు నమోదుచేసే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus