చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరోతో ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ కెరీర్ ప్రారంభంలో అలాంటి అవకాశం సాధించడం అంటే ఇంకా పెద్ద విషయం. అచ్చంగా అలాంటి ఛాన్సే కొట్టేశాడు దర్శకుడు బాబి. చేసినవి మూడు సినిమాలే అయినా మాస్ పల్స్ బాగా తెలిసినోడు అని ఆ సినిమాల తీరు చూస్తే అర్థమైపోతుంది. ఈ క్రమంలో నాలుగో సినిమా చిరంజీవితో చేస్తున్నాడు. ఈ సినిమా కథ గురించి బయట చాలా మాటలు వినిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చేశాడు బాబీ.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరంజీవితో చేయబోయే సినిమా ఒక అభిమానికీ, స్టార్‌కీ మధ్య అనుబంధం అంట. ఈ సినిమాకు మొత్తంగా చిరంజీవే స్ఫూర్తి. అవును చిరంజీవి సినిమాకు చిరంజీవే స్ఫూర్తి అని బాబీ చెబుతున్నాడు. అభిమాన హీరోకు ఇలాంటి ఇంట్రడక్షన్ సీన్స్ ఉండాలి. తెరపై కనిపిస్తే విజిల్స్ కొట్టాలనిపించే సన్నివేశాలు ఉండాలి అనుకుంటుంటాం కదా. అలాంటి మూమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయట. చిన్నతనం నుండి బాబీ దగ్గర ఇలాంటి కొన్ని మూమెంట్స్ ఉన్నాయట.
అవే గత రెండేళ్లుగా అతనితో ఈ కథ రాయించాయట. చిరంజీవికి కథ చెబుతున్నప్పుడు భయం, బెరుకు, ఆనందం అన్నీ కలగలిపిన అనుభూతి కలిగిందట బాబీకి. కథ చెప్పాక ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. అభిమానులకి ఏం కావాలో అచ్చంగా అలాగే ఉంటుందీ చిత్రం అని బాబీ కచ్చితంగా చెబుతున్నాడు.‘ఘరానా మొగుడు’, ‘రౌడీ అల్లుడు’,‘గ్యాంగ్‌లీడర్’ సినిమాల స్థాయిలో ఈ సినిమా ఉంటుందని బాబీ అంటున్నాడు. అన్నట్లు ఈ సినిమా దసరాకు ప్రారంభిస్తారట.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!