డిస్కో రాజా పై అంచనాలు పెంచేస్తున్న ఆ విలన్!

దర్శకుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం డిస్కో రాజా. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ స్టోరీతో డిస్కో రాజా తెరకెక్కుతుంది. నిన్న ఈ చిత్రం నుండి సెకండ్ టీజర్ విడుదల చేశారు. వార్ లో పాల్గొని వచ్చిన సోల్జర్ వైలెన్స్ లేక పేషెంట్ లా మారతాడు. క్యూర్ కావడానికి కిల్లర్ గా మారితే విధ్వసం ఎలా ఉంటుంది అనేదే మూవీ కథ అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఐతే ఈ చిత్రంలో విలన్ గా చేసిన బాబీ సింహ చిత్రంపై అంచనాలు పెంచేశారు. మధ్య వయస్కుడైన డేంజరస్ విలన్ గా బాబీ సింహ కనిపిస్తున్నాడు.

‘సేతు పేరు వింటే గుర్తుకు రావలసింది వయసు కాదు..భయం’, అని ఆయన చెప్పిన డైలాగ్ ఆసక్తి కలిగిస్తుంది. విలక్షణ నటుడిగా మంచి పేరున్న బాబీ సింహ నేషనల్ అవార్డు విన్నర్ కావడం విశేషం. జిగర్తాండ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు ఆయన ఉత్తమ సహాయ నటుడుగా జాతీయ అవార్డు గెలుపొందారు. జిగర్తాండ చిత్రంలో బాబీ పాత్రకే మార్పులు చేసి హరీష్ శంకర్ వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ చిత్రం తీయడం జరిగింది. ఇక డిస్కో రాజా చిత్రంలో సేతు అనే విలన్ రోల్ బాబీ సింహ చేస్తున్నారు. బాబీ సింహా విలన్ గా చేస్తుండటంతో డిస్కో రాజా చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రవి తేజ మరియు బాబీ సింహ మధ్య వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయని అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 19న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుండగా 24న చిత్రం విడుదల అవుతుంది.


సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus