ఒక్కటి కాబోతున్న రీల్ లైఫ్ నటులు..!
- April 18, 2016 / 09:07 AM ISTByFilmy Focus
జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా త్వరలో తన సహనటి రేష్మి మీనన్ ను వివాహం చేసుకొనున్నాడు. గత ఏడాది నవంబర్ లో వీరి నిశ్చితార్ధం జరగగా..ఇప్పుడు తిరుపతి వేదికగా.. ఏప్రిల్ 22 న వివాహం జరగనుంది.
తమిళంలో తెరకెక్కిన “జిగర్తాండ” చిత్రం ద్వారా బాబీ సింహా జాతీయ స్థాయిలో నటుడిగా మంచి పేరు గడించాడు. బాబీ మచిలీపట్నంలో పుట్టినప్పటికీ.. తెలుగులో చిత్రాలు చేయడానికి అతనికి చాలా కాలం పట్టింది. ఇటీవలే విడుదల అయిన రన్ చిత్రంతో బాబీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














