Naga Manikantha: నాగ మణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.!

‘బిగ్ బాస్ 8’ లో ‘పాతాళ గంగ’ టైపు కంటెస్టెంట్స్ ఒకరు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. మొదటి నుండి కూడా చూసుకుంటే.. ప్రతి సీజన్లో ఒక కంటెస్టెంట్ ఇలా ఉంటున్నారు. కాకపోతే ప్రతి సీజన్లో అమ్మాయిలు ఇలా ఉండటం చూశాం. ఈసారి ‘ఫర్ ఏ ఛేంజ్’ అనుకున్నట్టు ఉన్నాడు బిగ్ బాస్. ఈసారి అబ్బాయిని అలా అనుక్షణం కంటతడి పెట్టుకునేలా పెట్టాడు. అతను ఎవరో ఈ పాటికే మీకు తెలిసి ఉంటుంది కదా..!

Naga Manikantha

అతనే నాగ మణికంఠ (Naga Manikanta) . మొదటి రోజు నుండి ఇతను అయినదానికీ.. కానిదానికీ కూడా ఓ ఏడుస్తూ వైరల్ అవుతున్నాడు. మొదటి వారం ఇతని వైఖరి చూసి చాలా మంది.. మొదటి వారమే ఇతను ఎలిమినేట్ అయిపోతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ సింపతీ కొద్దీ ఇతనికి ఓట్లు పడినట్టు ఉన్నాయి. ‘నా భార్య నాకు కావాలి.. మా అత్తమామల వద్ద గౌరవం కావాలి.. నా కూతురు నాకు కావాలి’ అంటూ ఇతను కన్నీళ్లు పెట్టుకోవడం చాలా మందిని కదిలించింది.

అయితే మణికంఠ కామెంట్స్ ని బట్టి.. మణికంఠ (Naga Manikantha)  భార్య శాడిస్ట్ అంటూ కొంతమంది కామెంట్లు చేశారు. కానీ ఆమె చాలా మంచిది. హౌస్లోకి రావడానికి ఆమె చాలా సాయం చేసింది అంటూ లేటెస్ట్ ఎపిసోడ్స్ లో అతను చెప్పాడు. మరోపక్క కూతురు ఎందుకు దూరమైంది? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దాన్ని పక్కన పెట్టేస్తే.. మణికంఠ భార్య శ్రీప్రియ చూడటానికి పుష్టిగా కనిపిస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్లు ఈమె పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

చూడటానికి ‘కితకితలు సినిమాలో హీరోయిన్..లా ఉంది.. ఈమె కోసమా అంత ఎమోషనల్ అవుతున్నావ్’ అంటూ ఘోరమైన కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. దీంతో మణికంఠ (Naga Manikantha) సోదరి కావ్య అమర్నాథ్ స్పందించి.. ‘పెళ్లి వీడియో చూసి ఇలా కామెంట్లు పెట్టడం చాలా ఘోరమైన విషయం. అవి చూస్తే నాకు చాలా బాధేస్తోంది. నిజంగా ఇది హీనమైన చర్య’ అంటూ చెప్పుకొచ్చింది.

ఆ ఆరోపణలు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం.. హేమ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus