Jiiva Car Accident: యాక్సిడెంట్ పాలైన జీవా కారు.. ఫోటోలు వైరల్.!

ఆర్.బి.చౌదరి (R. B. Choudary) తనయుడు, తమిళ హీరో అయినటువంటి జీవా (Jiiva) అందరికీ సుపరిచితమే. ‘రంగం’ (Rangam) సినిమాతో పాపులర్ అయిన ఇతను తర్వాత ‘స్నేహితుడు’ ‘మాస్క్’ (Mask) వంటి సినిమాల్లో నటించాడు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘యాత్ర 2’ (Yatra 2)లో ఇతను వై.ఎస్.జగన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇదిలా ఉండగా.. అతని గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అదేంటంటే.. హీరో జీవా ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయ్యిందనే వార్త.. ప్రస్తుతం నెట్టింట షికారు చేస్తుంది.

Jiiva Car Accident

దీంతో అతని అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే.. హీరో తన కారులో చెన్నై నుండి సేలం వెళ్తున్నారు. అయితే కన్నిమయూర్ వద్ద ఆయన కారుకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఎదురుగా వస్తున్నా బైక్ ను తప్పిస్తున్న క్రమంలో బార్కేడ్ ను ఢీ కొట్టిందట జీవా (Jiiva) కారు. కారులో ఉన్న జీవా సీట్ బెల్ట్ ధరించడంతో పెద్దగా గాయాలు ఏమీ కాలేదు అని తెలుస్తుంది. అయితే కారు ముందు భాగం మాత్రం డ్యామేజ్ అయ్యిందట.

కాబట్టి.. జీవా (Jiiva) అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదు అని సమాచారం. ఇక ఈ యాక్సిండెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను గమనిస్తే.. జీవా ప్రయాణిస్తున్న కారు బ్లూ కలర్లో ఉంది. దాని ఫ్రంట్ భాగం మొత్తం డ్యామేజ్ అయ్యింది. ఓ ఫొటోలో జీవా కూడా కనిపిస్తున్నాడు. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘ది గోట్’.. 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus