బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి పరిచయం అవసరం లేదు. ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇప్పటికి పలు సినిమాలలో కీలకపాత్రలలో నటించడమే కాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమితాబ్ తన వ్యక్తిగత విషయాల గురించి పెద్ద ఎత్తున కంటెస్టెంట్లతో ముచ్చటిస్తూ ఉంటారు.
ఇకపోతే ఈయన సినిమాలలోకి రాకముందు కలకత్తాలో పని చేస్తున్న విషయాన్ని ఇది వరకు వెల్లడించారు. అయితే మరోసారి అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ తన చివరి జీతం ఎంత, తాను ఎలాంటి కష్టాలను అనుభవించారు అనే విషయాలను గుర్తు చేసుకున్నారు. అమితాబ్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు కలకత్తాలో చిన్న ఉద్యోగం చేసేవారు. 1968 లో తాను కలకత్తాలో పనిచేసేవాన్ని తెలిపారు. ఆ సమయంలో 10 బై 10 సైజు ఉన్న రూంలో నాతోపాటు మరో ఏడుగురుకలిసి ఉండే వాళ్ళమని
సాయంత్రం అయ్యేసరికి తన స్నేహితులతో కలిసి ఓ పెద్ద రెస్టారెంట్ ముందు వెళ్లే వాళ్ళం అయితే ఆ రెస్టారెంట్లోకి వెళ్లే అంత స్తోమత తనకు లేదు ఎప్పటికైనా ఇలాంటి రెస్టారెంట్ కి వెళ్లాలని కోరిక మాత్రం బలంగా ఉందని తెలిపారు. సినిమాలోకి రాకముందు కలకత్తాలోని బ్లాస్టర్స్ అనే కంపెనీలో తాను పనిచేసేవాన్ని అయితే అప్పటికి ఈయన నెల జీతం 1640 రూపాయలని తెలిపారు. అయితే ఇదే తన చివరి జీతం అంటూ ఈ సందర్భంగా అమితాబ్ తెలిపారు.
1968 నవంబర్ 30వ తేదీన తాను చివరి జీతం అందుకున్నానని ఇప్పటికి తన దగ్గర తన జీతానికి సంబంధించిన రసీదు భద్రంగా ఉందని అమితాబ్ తెలిపారు. తాను ఈ జాబ్ చేయకముందు కాళ్లకు చెప్పులు లేకుండా రోడ్లపై తిరుగుతూ ఉద్యోగం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డానని అప్పటి విషయాలను కష్టాలను గుర్తు చేసుకున్నారు. అయితే సినిమాలలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తన జీవితమే మారిపోయిందని, ఇప్పటికీ ఏదైనా షూటింగ్ పనుల కోసం కలకత్తా వెళ్లిన తన స్నేహితులను కలుస్తూ ఉంటానని బిగ్ బీ ఈ సందర్భంగా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.