బాహుబలి కంక్లూజన్ పై సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటి
- September 4, 2017 / 10:08 AM ISTByFilmy Focus
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన వెండితెర కళాఖండం బాహుబలి కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మెప్పించింది. 1800 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. బాహుబలి దెబ్బకి బాలీవుడ్ సినిమాల రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆ కోపంతోనే బాహుబలి 2 పై కొంతమంది బాలీవుడ్ నటులు అక్కసు వెళ్లగక్కారు. ఇప్పటికీ విమర్శిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి సయానీ గుప్తా ఈ చిత్రంపై సంచలన కామెంట్స్ చేసింది. బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ చూశాక ఈ సినిమా చూడాలన్న ఆసక్తి కలగలేదని ఆమె వెల్లడించి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం నవాజుద్ధీన్ సిద్ధికీకి జోడి హంగ్రీ సినిమాలో నటిస్తున్న సయానీ మీడియాతో మాట్లాడుతూ “బాహుబలిని హాలీవుడ్ చిత్రాలతో పోల్చలేము. అది కేవలం భారీ చిత్రం మాత్రమే.
బాహుబలి లాంటి సినిమాలో నటించే అవకాశం వచ్చినా నేను అంగీకరించను” అని పొగరుగా చెప్పింది. ఆమె మాటలపై బాహుబలి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో హైలెట్ కావాలని సయానీ బాహుబలి పేరుని ప్రస్తావించిందని చెబుతున్నారు. తమ పేరు హెడ్ లైన్స్ లో రావడానికి బాహుబలి పేరుని వాడుకోవడం ఫ్యాషన్ అయిపోందని విమర్శిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













