ఆర్ఆర్ఆర్ మూవీకి పాన్ ఇండియా సినిమాగా గుర్తింపు దక్కాలనే ఆలోచనతో దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్ లను భాగం చేశారు. అలియా, అజయ్ దేవగణ్ లకు సినిమాలో మరీ ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కకపోయినా తక్కువ నిడివి ఉన్న పాత్రలతో వీళ్లిద్దరూ మెప్పించారు. ఆర్ఆర్ఆర్ కు అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కొన్నిరోజుల క్రితం ప్రచారం జరిగిన విధంగా 3,000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అయితే ఆర్ఆర్ఆర్ కు తెలుగులో రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగగా హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. బాలీవుడ్ మీడియా ఆర్ఆర్ఆర్ ను టార్గెట్ చేసిందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే బాలీవుడ్ మీడియా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకు పాజిటివ్ గా రివ్యూలు వచ్చాయి. ఎన్టీఆర్, చరణ్ అభినయానికి బాలీవుడ్ ఫ్యాన్స్, క్రిటిక్స్ ఫిదా అవుతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గతంలో ఎప్పుడూ చూడని స్థాయిలో కొన్ని సీన్లు ఉన్నాయని క్రిటిక్స్ కామెంట్లు చేస్తున్నారు.
బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమాకు 3.5, 4 రేటింగ్ ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభను బాలీవుడ్ క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ మాస్టర్ పీస్ అని టెర్రిఫిక్ ఎంటర్టైనర్ అని బాలీవుడ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ లో కూడా ఆర్ఆర్ఆర్ సంచలనాలు సృష్టించడం ఖాయమని తేలిపోయింది. ఈ సినిమా పైసా వసూల్ ఎంటర్టైనర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.
ఈ సినిమాకు అంచనాలకు మించి కలెక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది రిలీజైన సినిమాలలో ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాన్ బాహుబలి రికార్డులు ఆర్ఆర్ఆర్ మూవీతో బ్రేక్ అవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అందరూ పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చినా బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఈ సినిమా గురించి నెగిటివ్ గా కామెంట్లు చేయడం గమనార్హం.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?