ఈ మధ్య కాలంలో వరుసగా సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అవుతుంటే పుష్ప ది రైజ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. సౌత్ సినిమాల ఫలితాల వల్ల పలు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే తాజాగా బాలీవుడ్ ఎగ్జిబిటర్ ఒకరు సౌత్ సినిమాల గొప్పదనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ ఎగ్జిబిటర్ మనోజ్ దేశాయ్ ఐపీఎల్ జరిగే సమయంలో కూడా పాన్ ఇండియా సినిమాలు భారీస్థాయిలో కలెక్షన్లను సాధించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని తెలిపారు. ప్రస్తుతం మా థియేటర్లలో కేజీఎఫ్2 ప్రదర్శితమవుతోందని ఆయన వెల్లడించారు. కేజీఎఫ్2 సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారని ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయని ఆయన కామెంట్లు చేశారు. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో భారీస్థాయిలో బిజినెస్ చేయడంతో పాటు కరోనా తర్వాత ఎగ్జిబిటర్లు పుంజుకోవడానికి కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
సౌత్ సినిమాలు లేకపోతే రోడ్డున పడేవాళ్లమని కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ కష్టాల్లో ఉన్న తమకు సహాయం చేశాయని ఆయన వెల్లడించారు. సౌత్ సినిమాకు కృతజ్ఞతలు చెబుతూ మనోజ్ దేశాయ్ కామెంట్లు చేశారు. మనోజ్ దేశాయ్ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మేకర్స్ కుళ్లుకునే విధంగా మనోజ్ దేశాయ్ కామెంట్లు ఉన్నాయి. పుష్ప2, సలార్, శంకర్ చరణ్ కాంబో మూవీ కూడా బాలీవుడ్ లో సత్తా చాటుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాలపై కూడా భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సౌత్ ఇండియా సినిమాలు తెగ నచ్చేస్తున్నాయి. కేజీఎఫ్2 సినిమాకు బాలీవుడ్ లో నెగిటివ్ రివ్యూలు వచ్చినా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. కేజీఎఫ్2 బాలీవుడ్ లో అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తోంది.