Jr NTR: తారక్ పై అభిమానాన్ని చాటుకున్న బాలీవుడ్ హీరో!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప నటులలో ఒకరు. ఎలాంటి పాత్రలో నటించినా తన నటనతో మెప్పించగల ప్రతిభ ఉన్న నటుడు ఎన్టీఆర్ కావడం గమనార్హం. తారక్ యాక్టింగ్ వల్లే యావరేజ్ రిజల్ట్ ను అందుకోవాల్సిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ తరం హీరోలలో వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.

తారక్ తో ఒక్క సినిమాలో నటించిన వాళ్లు సైతం తారక్ నటనను ప్రశంసించకుండా ఉండలేరనే సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ సౌత్ లో పలు సినిమాలలో విలన్ రోల్స్ లో నటించి బాలీవుడ్ లో హీరోగా సత్తా చాటుతున్నారు. ఖుదా హఫీజ్2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన విద్యుత్ జమ్వాల్ తారక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన శక్తి సినిమా నుంచి ఎన్టీఆర్ కు తనకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని ఊసరవెల్లి సినిమాతో ఆ బాండింగ్ మరింత బలపడిందని ఆయన అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ తన హీరో అని విద్యుత్ జమ్వాల్ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తనను స్టార్ లా ట్రీట్ చేయడంతో పాటు కమాండో2 సినిమా చూడాలని ప్రచారం చేశారని తారక్ గ్రేట్ డ్యాన్సర్ అని ఆయన తెలిపారు. జులై 8వ తేదీన ఖదా హఫీజ్2 విడుదల కానుందని ఈ సినిమాలో తండ్రి పడే వేదనను చూపించామని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమా చూసే సమయంలో ఆడియన్స్ సైతం తండ్రి పడే వేదనకు సంబంధించిన అనుభూతికి లోనవుతారని విద్యుత్ జమ్వాల్ వెల్లడించారు. విద్యుత్ జమ్వాల్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి విద్యుత్ జమ్వాల్ చేసిన కామెంట్లు తారక్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus