Saba Qamar: ఏంటో.. ఈ కొత్త హీరోయిన్‌ కొత్త పోకడ

నిశ్చితార్థం.. తర్వాత పెళ్లి… ఇద్దరికీ పొసగకపోతే బ్రేకప్‌. ఇదీ వివాహ వ్యవస్థలో జరుగుతున్న విధానం. అయితే నిశ్చితార్థం అయ్యి.. ఇంకా పెళ్లి కాకుండానే బ్రేకప్‌ చెప్పేసింది ఓ నటి. దీంతో ఇప్పుడామె పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది. ఆమెవరో కాదు… ప్రముఖ బాలీవుడ్‌ నటి సబా కరమ్‌. ‘హిందీ మీడియం’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భామ ఈమె. మరి ఆమె బ్రేకప్‌ వ్యవహారమేంటో చూద్దాం! వ్యాపారవేత్త అజీమ్‌ ఖాన్‌తో సబా కమర్‌ నిశ్చితార్థం ఇటీవల జరిగింది.

త్వరలో పెళ్లి అనుకుంటుండగా, ఈ భామ పెళ్లికి బ్రేకప్‌ చెబుతున్నట్టు ఇన్‌స్టా గ్రామ్‌ వేదికగా ప్రకటించేసింది. దీంతో ఏమైందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అజీమ్ ఖాన్‌తో నా ఎంగేజ్‌మెంట్‌ తర్వాత బ్రేకప్‌ చెప్తున్నాను అంటూ చెప్పింది సబా. మేమిద్దరం పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పటివరకూ నన్ను సపోర్ట్‌ చేసిన మీరందరూ ఇకపైనా నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది సబా. అంతేకాదు బ్రేకప్‌కి కారణం కూడా చెప్పింది సబా కమర్‌. సరైన సమయంలోనే చేదు నిజాలను గ్రహించాను.

నేను అజీమ్‌ ఖాన్‌ను ఇప్పటివరకూ కలవలేదు. కేవలం ఫోన్ల ద్వారానే మాట్లాడుకున్నాం అని కూడా చెప్పింది. ఈ విషయమై అజీమ్‌ కూడా స్పందించాడు. ‘‘నువ్వు మంచి మనసున్న వ్యక్తివి. దేవుడు నీకు అన్నివేళలా విజయాన్నే అందించాలని కోరుకుంటున్నాను.ఈ బ్రేకప్‌ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా’’ అని రిప్లై ఇచ్చాడు. ఇక్కడో గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే… అజీమ్‌కు సబాతో నిశ్చితార్థం అయిన కొన్ని రోజులకే అతనిపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే అజీమ్‌తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సబా ప్రకటించిందని సమాచారం.


Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus