దిల్‌ రాజు ప్లానింగ్‌ మామూలు విషయమా?

రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా ప్రకటించింది మొదలు… సినిమాలో నటించేది వాళ్లే, పని చేసే టెక్నీషియన్లు వీళ్లే అంటూ చాలా రకాల వార్తలు వస్తున్నాయి. అయితే హీరో, దర్శకుడు, నిర్మాత తప్ప ఈ సినిమాకు సంబంధించి ఏ పేర్లూ ఫైనల్‌ కాలేదు అనేది నిర్మాణ సంస్థ దగ్గర వ్యక్తుల మాట. కానీ బ్యాగ్రౌండ్‌లో చాలా చర్చలు, ఒప్పందాలు జరుగుతున్నాయట. అందులో భాగంగా మొన్నామధ్య సంగీత దర్శకుడు కూడా ఓకే అయ్యారని వార్తలొచ్చాయి. ఇప్పుడు సినిమా హీరోయిన్‌ ఇప్పటికే ఓకే అయ్యిందని సమాచారం.

దిల్‌ రాజు తన ప్రొడక్షన్‌లో 50వ సినిమాగా చరణ్‌ – శంకర్‌ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా కియారా అడ్వాణీని ఎంచుకున్నారనే విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతుందనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. దీంతో కథానాయిక బాలీవుడ్‌ నుండి అయితే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. దీంతో కియారా పేరును చర్చలోకి తీసుకొచ్చారు. గతంలో వీరిద్దరూ ‘వినయ విధేయ రామా’లో నటించారు. ఆ సినిమా సరైన ఫలితం ఇవ్వకపోయినా, జోడీకి మంచి మార్కులే పడ్డాయి.

హీరోయిన్‌ విషయంలోనే కాదు… మిగిలిన నటీనటుల విషయంలోనూ దిల్‌ రాజు భారీ ప్లానింగే వేస్తున్నారట. ఖర్చు విషయంలో ఇప్పటికే ఓ లెక్క సిద్ధం చేసుకున్న దిల్‌ రాజు అండ్‌ కో. ఇప్పుడు టీమ్‌ విషయంలో అదే దిశగా పక్కా ప్లానింగ్‌తో ఉందట. మొత్తం భారతీయ చిత్రపరిశ్రమలో బెస్ట్‌ టీమ్‌ను తీసుకొస్తున్నారట. సంగీత దర్శకుడిగా అనిరుధ్‌, తమన్‌ పేర్లు వినిపించాయి. అందులో అనిరుధ్‌కే ఎక్కువ అవకాశం ఉందని అంటున్నారు. అంతా ఓకే గానీ… హెడ్డింగ్‌లో ‘ఆలియా’ అన్నారు… కియారా పేరు చెప్పారేంటి అనుకుంటున్నారా… కియారా అసలు ఆలియానే కదా. అందుకే అలా రాశామన్నమాట.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus