ముంబయి నుండి అంత ఇష్టపడి తెచ్చారు.. ఇలా చేశారేంటి?

బాలీవుడ్‌ హీరోయిన్లను (Heroine) తెలుగు సినిమాల్లో తీసుకుంటారు అంటే.. వాళ్లకు ఏదో అద్భుతమైన క్యారెక్టర్‌ ఇచ్చేస్తారో, వాళ్లను ఆస్కార్‌ రేంజి యాక్టింగ్‌ చేయిస్తారనో ఆశించలేం. ఆ మాటకొస్తే ఏ నటులను తీసుకున్నా అలా అనుకోలేం. అయితే వాళ్లకు మినిమమ్‌ స్క్రీన్‌ స్పేస్‌ వస్తుందని మాత్రం ఆశిస్తాం. మరి మన దర్శకుల ఆలోచనలు అలానే ఉన్నాయా? ఏమో గత కొన్ని సినిమాలు అందులోనూ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ల ససినిమాలు చూస్తుంటే ఇదే మాట అనిపిస్తోంది.

Heroine

కావాలంటే మీరే చూడండి.. బాలీవుడ్‌లో బాగా పేరు తెచ్చుకున్న.. కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న నాయికలు కొంతమంది తెలుగు సినిమాల్లో నటించారు. మరి ఆ సినిమాల్లో వాళ్లకు మంచి స్క్రీన్‌ స్పేస్‌ దొరికిందా? అంటే లేదు అనే సమాధానమే వస్తుంది. ‘దేవర’ (Devara) సినిమాలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) స్క్రీన్‌ స్పేస్‌ విషయంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలో ఆలియా భట్‌ (Alia Bhatt) గురించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు.

‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్‌కు, ఆమె పాత్రకు ఎంత హైప్ ఇచ్చారో మీకు కూడా తెలుసు. సినిమాలో ఆమె పాత్ర, ఆ పాత్ర ఆవశ్యకం అంటూ గొప్పగా మాట్లాడింది సినిమా టీమ్‌. ఆమె కూడా అంతే ఉత్సుకతతో కనిపించింది. కట్‌ చేస్తే సినిమా వచ్చాక చూస్తే సెకండాఫ్‌లో కానీ కనిపించలేదు. పోనీ అప్పుడు వచ్చి ఏమన్నా అదరగొట్టిందా అంటే నాలుగైదు సీన్సే ఇచ్చారు. అందులో అందాల ఆరబోత తప్ప. ఇంకేం లేదు. పోనీ అదైనా ఉందా అంటే అందులో కొంత కోత పెట్టారు.

ఇప్పుడు జాన్వీ కపూర్ పరిస్థితి ఎలా ఉందో.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆలియా పాత్ర కూడా అంతే. ఏదో రెండు, మూడు సీన్లలో ఆమె ప్రభావం ఉంటుంది. అలాగే ‘వినయ విధేయ రామ’లో (Vinaya Vidheya Rama) కియారా అడ్వాణీ (Kiara Advani), ‘లైగర్‌’లో (Liger) అనన్య పాండే (Ananya Panday) పరిస్థితీ ఇంచుమించు ఇంతే. దీంతో బాలీవుడ్‌ నాయికల దగ్గర తెలుగు సినిమాల ఛాన్స్‌లు వెళ్తే ఈ సినిమాలు వాళ్లకు గుర్తుకురాకుండా ఉండాల్సిన పరిస్థితి.

దేవర షూటింగ్ డైరీస్ నుంచి ఇంట్రెస్టింగ్ మేటర్ చెప్పిన తారక్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus