Koratala Siva: దేవర షూటింగ్ డైరీస్ నుంచి ఇంట్రెస్టింగ్ మేటర్ చెప్పిన తారక్!

అందరి అంచాలను, విశ్లేషణలను తలకిందులు చేస్తూ “దేవర” (Devara) సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తొలిరోజు 172 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన దేవర చిత్రం రెండోరోజు కలెక్షన్ డీటైల్స్ ఇంకా చిత్రబృందం అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాల్సి ఉండగా.. ఈ సినిమాషూటింగ్ విషయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన విజయాన్ని ఎన్టీఆర్  (Jr NTR) చెప్పుకొచ్చాడు. “దేవర” ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో కపిల్ శర్మ కామెడీ షోకి ఎన్టీఆర్ వెళ్లిన విషయం తెలిసిందే.

Koratala Siva

సదరు ఎపిసోడ్ నిన్న రాత్రి నెట్ ఫ్లిక్స్ లో విడుదలై స్ట్రీమ్ అవుతోంది. ఈ షోలో ఎన్టీఆర్ “దేవర” గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. అందులో ఒక ఆసక్తికరమైన విషయం సినిమాలో అందర్నీ అలరించిన “చుట్టమల్లే” పాట షూటింగ్ థాయిల్యాండ్ లో జరగగా, ఆ షూట్ కి కొరటాల  (Koratala Siva)  వెళ్లలేదట. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ల్లో బిజీగా ఉన్న కొరటాల, పాట చిత్రీకరణ బాధ్యతను పూర్తిగా కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ కే అప్పగించేసాడట.

ఈ తరహాలో సాంగ్ షూట్స్ కి డైరెక్టర్స్ వెళ్లకపోవడం ఇదేమీ మొదటిసారి కాకపోయినా.. ఓ పాన్ ఇండియన్ లెవెల్ సినిమా సాంగ్ షూట్ లో డైరెక్టర్ లేకపోవడం మాత్రం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఎంత ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఫుటేజీలు చూసినా లైవ్ లో ఉండి జాగ్రత్తగా చూసుకోవడం వేరు కదా. కొరటాల ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ.. “చుట్టమల్లే” పాట థియేటర్లలో హల్ చల్ చేస్తుంది.

ముఖ్యంగా పాటలో వచ్చే “హా” సౌండ్ కి థియేటర్లో ఆడియన్స్ కోరస్ పాడడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో తారక్ స్క్రీన్ ప్రెజన్స్ కంటే జాన్వీ (Janhvi Kapoor)  అందాలకే ఎక్కువ మార్కులు పడ్డాయి. తెల్లటి ఇసుక తెప్పలపై జాన్వీ ఆరబోసిన అందాలు అలాంటివి మరి!

ప్రణతి నా కోసం ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యింది: ఎన్టీఆర్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus