టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ స్టార్ హీరోయిన్ తల్లి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డబ్బుల కోసం ఆమె ప్లే చేస్తున్న చీప్ ట్రిక్స్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలీవుడ్ నిర్మాతలను ఆమె మోసం చేస్తున్న తీరు గురించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాన్ని ఓ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్న ఓ యంగ్ హీరోయిన్‌కు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి.
Sreeleela
అయితే, ఆమె తల్లి మేకప్ ఆర్టిస్టుల విషయంలో ఓ కొత్త స్కామ్‌కు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె బాలీవుడ్ నిర్మాతలను, మేకప్ ఆర్టిస్టులను నేరుగా మాట్లాడుకోనివ్వకుండా చూస్తుందట. తానే స్వయంగా మేకప్ ఆర్టిస్ట్‌ను సంప్రదించి, వారికి అసలు పేమెంట్ ఇచ్చి, ఆ తర్వాత నిర్మాతలకు డబుల్ పేమెంట్ చెబుతుందట.ఈ విధంగా మధ్యలో ఉండి భారీగా డబ్బులు దండుకుంటోందని, ఇది తెలియని నిర్మాతలు మోసపోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఈ వ్యవహారంపై విసిగిపోయిన ఓ ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా ఆమె గురించి పోస్ట్ పెట్టాడు. పరోక్షంగా ఆ స్టార్ హీరోయిన్ తల్లికి వార్నింగ్ కూడా ఇవ్వడం షాకిచ్చే అంశం. ఆ మేకప్ ఆర్టిస్ట్ పోస్టులో… “ఓ స్టార్ ఇమేజ్ హీరోయిన్ ఉన్న అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు నన్ను కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. వాళ్లు చాలా అన్‌ప్రొఫెషనల్. సౌత్ టీమ్‌లు తక్కువ రేటుకు పనిచేస్తాయని మమ్మల్ని కూడా అలాగే పని చేయమంటున్నారు. నాకు ఇష్టం లేదని చెప్పినా పదే పదే కాల్స్, మెసేజ్‌లు చేస్తున్నారు.
మీ టీమ్ పేమెంట్లు తినడం ఆపండి, లేదంటే ఈసారి పేరుతో సహా బయట పెడతాను” అంటూ ఆమె తన పోస్టులో తీవ్రంగా హెచ్చరించింది.ఈ ఆరోపణలు, మేకప్ ఆర్టిస్ట్ పెట్టిన పోస్టులు ఇప్పుడు రెండు సినీ పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతకీ ఆ యంగ్ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆమె తల్లి ఎవరు? అని ఇప్పుడు అంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఈ క్రమంలో శ్రీలీల, ఆమె తల్లి అయ్యుంటారనే అభిప్రాయాలు కూడా ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.