తాప్సి పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న బాలీవుడ్ మీడియా..!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారు ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తాప్సి ని టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం చేసారు. ఆ చిత్రంలో తన గ్లామర్ షో తో కుర్రకారుతో పాటూ దర్శక నిర్మాతల్ని కూడా బాగా ఆకట్టుకుంది. అయితే తరువాత ఆమెకు ఎక్కువగా అవే గ్లామర్ రోల్స్ ఇస్తూ వచ్చారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో తాప్సి నటించిన ‘వస్తాడు నా రాజు’ ‘మొగుడు’ ‘దరువు’ ‘వీర’ ‘గుండెల్లో గోదారి’ వంటి చిత్రాలన్నీ ప్లాపులు కావడంతో తరువాత ఎవరూ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. మధ్యలో వచ్చిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రంతో పర్వాలేదనిపినప్పటికీ… తాప్సి కి పెద్దగా ఉపయోగ పడలేదు. అయితే మొదటి సారి ఆమె నటనకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో గోపీచంద్ ‘సాహసం’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో తాప్సి మంచి నటన కనపరిచింది. ఈ విషయాన్ని తెలుగు ఆడియన్స్ గుర్తించకపోయినా… బాలీవుడ్ దర్శక నిర్మాతలు బాగా గమనించారు.

బాలీవుడ్‌లో తాప్సి కి… అక్షయ్ కుమార్ ‘బేబీ’ చిత్రంలో చిన్న యాక్షన్‌ రోల్‌ దక్కింది. రోల్ చిన్నదే అయినా తాప్సికి మంచి మార్కులే పడ్డాయి. ఇక దాంతో ఆమె జాతకం మారిపోయిందనే చెప్పాలి. తరువాత వచ్చిన ‘పింక్‌’ చిత్రంతో ఆమె టాలెంట్‌ ఏమిటనేది అందరికీ తెలిసింది. ప్రస్తుతం తాప్సికి అన్నీ పర్‌ఫార్మెన్స్‌ రోల్స్ మాత్రమే వస్తుండడం విశేషం. తాజాగా విడుదలైన ‘బద్‌లా’ చిత్రం కూడా తాప్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అమితాబ్ బచ్చన్ తో పోటీ పడి మరీ నటించి ప్రశంసలు అందుకుంటుంది తాప్సి. ఈ చిత్రానికి ‘పింక్‌’ ను మించి ఓపెనింగ్స్ వస్తున్నాయట. ఇక ‘తాప్సి ఈ జనరేషన్‌ హీరోయిన్‌, ఆమెలా అందరూ ఆలోచించాలని బాలీవుడ్‌ మీడియా’ అంటూ బాలీవుడ్ మీడియా తాప్సి పై ప్రత్యేక కథనాలు రాసేస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus