Mahesh Babu: మహేష్ క్రేజ్ చూసి అవాక్కవుతున్న బాలీవుడ్ జనాలు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. నిన్న ‘యానిమల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. రాజమౌళి కూడా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. అయితే చాలా మంది చూపు మహేష్ బాబు పైనే ఉంది అనేది అక్షర సత్యం.మంత్రి మల్లారెడ్డితో పాటు యానిమల్ సినిమా యూనిట్ అంతా మహేష్ బాబు పై పొగడ్తల వర్షం కురిపించింది.

సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ అయితే మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమాలోని ‘డోలె డోలె’ పాటకి డాన్స్ వేశారు. మహేష్ తో కూడా డాన్స్ వేయించే ప్రయత్నం చేశారు. అలాగే హీరో రణబీర్ కపూర్ అయితే మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాలోని డైలాగ్ చెప్పి ఆశ్చర్యపరిచారు. హీరోయిన్ రష్మిక సైతం మహేష్ బాబు కోసం ‘హి ఈజ్ సో క్యూట్.. హి ఈజ్ సో స్వీట్’ అంటూ తమ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ లోని పాటని అందుకుంది.

ఓ రకంగా ఇది ‘యానిమల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనాలో లేక మహేష్ బాబుకి అభినందన సభ అనాలో అర్థం కాక అక్కడికి వచ్చిన జనాలు ఆశ్చర్యపోయారు. ఇక్కడి జనాలే కాదు.. బాలీవుడ్ సెలబ్రిటీలకు, మీడియాకి, అక్కడి ప్రేక్షకులకు కూడా ఇది పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే మహేష్ బాబు.. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో కూడా నటించలేదు.అయినా ఈ రేంజ్ ఫాలోయింగా అని వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు.

మహేష్ (Mahesh Babu) తలుచుకుంటే పాన్ ఇండియా సినిమాలో నటించడం పెద్ద కష్టమైన పనికూడా కాదు.అతను ఓకే అంటే బోలెడుమంది దర్శకులు స్క్రిప్ట్ లతో రెడీగా ఉంటారు. అలాగే మహేష్ సతీమణి నమ్రత తలుచుకుంటే ఆ పాన్ ఇండియా సినిమాని హిందీలో బాగా ప్రమోట్ చేయించగలదు. అయినా మహేష్ తొందరపడటం లేదు. ‘గుంటూరు కారం’ సినిమా కూడా తెలుగు సినిమాగానే రూపొందుతుంది. రాజమౌళి.. మహేష్ తో చేయబోయే సినిమా ఎలాగూ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది కాబట్టి.. ఆ సినిమాతో ఈ విషయం ఇంకా బాగా అర్ధమవుతుందేమో..!

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus