మంచు వారి ‘కన్నప్ప’… బాలీవుడ్‌ నుంచి వచ్చేది ఎవరంటే?

మంచు కుటుంబం నుండి చాలా ఏళ్లుగా వినిపించిన సినిమా పేరు అంటే అది ‘భక్త కన్నప్ప’ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా గురించి మోహన్‌బాబు, విష్ణు మాట్లాడారు. భారీ స్థాయిలో ఆ సినిమా ఉంటుంది అంటూ పెద్ద పెద్ద రచయితల పేర్లు వినిపించాయి కూడా. అయితే చాలా చాలా ఏళ్ల తర్వాత ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించుకుంది. ఈ క్రమంలో సినిమాలో నటిస్తున్న వాళ్ల పేర్లు బయటికొస్తుంటే సినిమా మీద అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా మరో నటుడి పేరు బయటికొచ్చింది. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అంటూ సౌత్‌ సినిమా పరిశ్రమల నుండి నటులను సినిమాలో భాగం చేసి ఆశ్చర్యపరిచిన ‘కన్నప్ప’ టీమ్‌ ఇప్పుడు బాలీవుడ్‌వైపు దృష్టి సారించింది. అలా సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ సీనియర్‌ యాక్టర్‌ సునీల్‌ శెట్టిని తీసుకున్నారని ఓ టాక్‌. ఈ సినిమాలో సునీల్‌ శెట్టి ఆసక్తికర పాత్రలో కనిపించబోతున్నారట. ఆయనే కాకుండా ఇంకొంతమంది బాలీవుడ్‌ యాక్టర్‌లు ఈ సినిమాలో ఉండొచ్చట.

గతంలో సునీల్ శెట్టి, మంచు విష్ణు ‘మోస‌గాళ్లు’ అనే సినిమా చేశారు. ఆ నిమా సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం కారణంగానే, సునీల్ శెట్టి ‘క‌న్న‌ప్ప‌’ సినిమాలో నటిస్తున్నాడట. ఇక ముందు చెప్పిన ఇతర పరిశ్రమలో నటుల సంగతి చూస్తే… మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ ఈ సినిమాలో ఆదివాసీ తెగ‌కు సంబంధించిన ఒక కీలక వ్యక్తిగా కనిపిస్తాడట. అతను కాకుండా శివ రాజ్‌కుమార్‌, శరత్‌ కుమార్‌ తదితరులు నటిస్తున్నారట.

ఇక ఈ సినిమాలో(Kannappa) మహా శివునిగా ప్రభాస్ కనిపించనున్నాడట. పార్వతీ దేవిగా నయనతార కనిపించనుంది అని టాక్. ఈ విషయంలో అధికారిక ప్రకటనలు త్వరలో ఉంటాయి అంటున్నారు. అన్నట్లు ఈ సినిమాలో కథానాయికగా ప్రీతి ముకుందన్‌ను తీసుకున్నట్లు ఇటీవల టీమ్‌ ప్రకటించింది. ఈ సినిమాలో ఐదారు నెలల్లో పూర్తి చేస్తామని ఇటీవల టీమ్‌ మొత్తం న్యూజిలాండ్‌ వెళ్లిపోయింది. త్వరలో షూటింగ్‌ పూర్తి చేసుకుని వచ్చేస్తుందట.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus