హిట్ సినిమా సీక్వెల్ లో బాలయ్య హీరోయిన్!

రెండేళ్ల క్రితం టాలీవుడ్ లో విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ‘ఎఫ్ 2’ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్లు కనిపించబోతున్నాయి.

అదనంగా మరికొన్ని క్యారెక్టర్లను డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ క్రమంలో సినిమాలో మరో హీరోయిన్ కి చోటు కల్పించినట్లు తెలుస్తోంది. తమన్నా, మెహ్రీన్ లతో పాటు ఇందులో ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నారట. ఆ బ్యూటీ ఎవరంటే సోనాల్ చౌహాన్. నిజానికి సోనాల్ తెలుగులో బాలయ్యతో ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ వంటి చిత్రాల్లో నటించింది. అలానే ‘సైజ్ జీరో’ సినిమాలో కూడా కనిపించింది. మళ్లీ ఇంతకాలానికి ఈమెకి మరో తెలుగు సినిమాలో ఛాన్స్ రావడం..

అది కూడా ‘ఎఫ్ 3’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ కావడం విశేషం. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా వుండబోతుందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే సోనాల్ చౌహన్ సినిమా షూటింగ్ లో పాల్గొనుంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus