మహేష్ బాబు సినిమాకి కూడా పాన్ ఇండియా కళ రప్పిస్తున్నారుగా..!

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు.. తన తరువాతి చిత్రాన్ని ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి)తో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను ఈ మధ్యనే విడుదల చేశారు. తమన్ అందించిన బి.జి.యం ఈ మోషన్ పోస్టర్ కు ఫస్ట్ హైలెట్ అయ్యింది. ఇక మహేష్ మెడ పై రూపాయి కాయిన్ టాటూ కూడా బాగా హైలెట్ అయ్యింది.

ఈ చిత్రంలో మహేష్ బాబు డబుల్ రోల్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తుంది. ఓ పాత్ర చాలా మాస్ గా ఉంటుందని.. మరో పాత్ర క్లాస్ గా ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది. అలాంటప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఉంటారు.. కానీ ప్రస్తుతానికి కీర్తి సురేష్ పేరు మాత్రమే ఖరారైంది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ చిత్రంలో విలన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఈ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుధీప్, అలాగే బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి పేర్లు వినిపించాయి.

మొన్నటికి మొన్న సునీల్ శెట్టి.. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ వెయ్యడంతో అతను కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు అనిల్ కపూర్ పేరు కూడా వినిపిస్తుండడం కొత్త కన్ఫ్యూజన్ కు తెరలేపినట్టు అయ్యింది. ఇటీవల దర్శకుడు పరశురామ్ .. అనిల్ కపూర్ ను కలిసి కథ వినిపించారట. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఆయన ఫిక్స్ అయితే మహేష్ సినిమాకి కూడా పాన్ ఇండియా కళ వచ్చేసినట్టే అని చెప్పాలి.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus