Sukumar: లెక్కల మాస్టారుకి డ్రిల్‌ మాస్టార్‌ పిలుపు

‘ఆర్య’తో అల్లు అర్జున్‌ను లవర్‌ బాయ్‌ను చేశారు సుకుమార్‌. ఇప్పుడు ‘పుష్ప’తో అల్లు అర్జున్‌ను పాన్‌ ఇండియా హీరోను చేసేశారు. త్వరలో బన్నీ బాలీవుడ్ సినిమాలో నటిస్తారని టాక్‌ కూడా వినిపిస్తోంది. అంతేకాదు సుకుమార్‌ కూడా బాలీవుడ్‌కి వెళ్లే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది. ఇదేదో గాలి వార్త కాదు. సుకుమార్‌ చెప్పిన వార్తే. ‘పుష్ప’ సినిమా చూసిన తర్వాత బాలీవుడ్‌ అగ్ర హీరో ఒకరు ఫోన్‌ చేసి విష్‌ చేశారట. ఆ తర్వాత తనతో సినిమా చేయాలని కూడా కోరారట.

ఎవరా హీరో అనుకుంటున్నారా? ఇంకెవరు ఖిలాడీ అక్షయ్ కుమార్‌. బాలీవుడ్‌ వరుస సినిమాలు, వరుస హిట్ల హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్‌ ఇటీవల ‘పుష్ప’ సినిమా చూశారు. ఆ తర్వాత సినిమాను మెచ్చుకుంటూ ఓ ట్వీట్‌ కూడా చేశారు. అక్కడితో ఆగకుండా సుకుమార్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారట. అంతగా నచ్చేసింది ఆయనకి సినిమా. ఫోన్‌ కాల్‌లో మాట్లాడుకున్నాక… అసలు విషయం చెప్పారట అక్షయ్. అదే సినిమా కాంబినేషన్‌. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది.

అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’. డిసెంబర్‌ 17న విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. తొలినాళ్లలో డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్నా ఆ తర్వాత మంచి విజయం దిశగా సాగింది. టాలీవుడ్‌ కంటే ఇతర వుడ్స్‌లోనే సినిమాకు ఎక్కువ పేరు వచ్చిందంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో సుమారు ₹100 కోట్లు సాధించిపెట్టిందని టాక్‌. .దాంతోపాటు ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంది.

అక్షయ్‌తో మాట్లాడటం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తానని సుకుమార్‌ చెప్పారు. ఈ లెక్కన డ్రిల్‌ మాస్టార్‌తో లెక్కల మాస్టారు సినిమా త్వరలోనే ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. సుకుమార్‌ను లెక్కల మాస్టారు ఎందుకంటారో మీకు తెలుసు. ఇక అక్షయ్‌ అంటే డిసిప్లీన్‌, పంక్చువాలిటీకి మారు పేరు. అందుకే అతణ్ని కొందరు డ్రిల్‌ మాస్టార్‌ అని అంటుంటారు. అయితే ‘పుష్ప 2’తో సుకుమార్‌ ఈ ఏడాది అంతా బిజీ అంటున్నారు. ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో సినిమా ఉంటుందని ఇటీవల రాజమౌళి అన్యాపదేశంగా చెప్పేశారు. కాబట్టి ఈ రెండు సినిమాల తర్వాతే అక్షయ్‌ సినిమా ఉండొచ్చు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus