Allu Arjun: జెనీలియా ‘బొమ్మరిల్లు’ దర్శకుడి పై కోపం తెచ్చుకుని వెళ్ళిపోయిన వేళ..!

‘బొమ్మరిల్లు’ చిత్రం విడుదలై 15 ఏళ్ళు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆ చిత్రం దర్శకుడు భాస్కర్ ఓ యూట్యూబ్ ఛానల్ వారికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించాడు. ఈ నేపథ్యంలో చిత్రీకరణ సమయంలో ఓ రోజు భాస్కర్ పై అలిగి.. ఈ సినిమా చేయను అని చెప్పి ఆమె వెళ్లిపోయిందట. ఆ టైములో బన్నీ వచ్చి నచ్చజెప్పడంతో ఆమె తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యిందట.

వివరాల్లోకి వెళితే.. ‘బొమ్మరిల్లు’ సినిమాలో జెనీలియా అర్ధరాత్రి పూట రోడ్డు పై ఐస్ క్రీం తింటూ ఉంటుంది హీరోయిన్ జెనీలియా. అలా తినడానికి వెళ్లే ముందు హీరోకి ఫోన్ చేస్తే అతను వద్దని చెబుతాడు. అయినప్పటికీ అతని మాటని లెక్కచేయకుండా వెళ్తున్నాను అని చెప్పడంతో హీరో గోడదూకి మరీ ఆమె వద్దకు వెళ్తాడు. అలా అతను వెళ్లినప్పుడు.. ‘తింటావా అని’ అంటుంది జెనీలియా. ఈ డైలాగ్ చెప్పేటప్పుడు దర్శకుడు ఆశించిన విధంగా ఆమె డైలాగ్ చెప్పడం లేదట. నైట్ 9,10 గంటలకు ఆ సీన్ షూటింగ్ మొదలుపెట్టారట.

తెల్లవారుజాము వరకు ఆ సీన్ చేస్తూనే ఉన్నారట. రెండు డైలాగులకి అంత ఇబ్బంది పెట్టడం ఏంటని కోపం వచ్చి ఆమె వెళ్లిపోయిందట. అయితే అల్లు అర్జున్ వచ్చి ‘వన్ డే లో జడ్జ్ చేయొద్దు. చాలా మంచి డైరెక్టర్ అతను’ అని నచ్చజెప్పడంతో ఆమె కన్విన్స్ అయ్యిందట. అటు తర్వాత జెనీలియా దర్శకుడికి సారి కూడా చెప్పిందట.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus