Boney Kapoor: నేను బితికుండగానే శ్రీదేవి బయోపిక్‌ రాదు… బోనీ సెన్సేషనల్‌ కామెంట్స్‌!

సినిమా నటుల బయోపిక్స్‌ రావడం మనకు కొత్తేం కాదు. వందేళ్లు దాటిన మన సినిమా చరిత్రలో బయోపిక్స్‌ తీయగలిగిన నటులు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ల బయోపిక్‌ కోసం అభిమానులు, వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తుంటారు. అయితే ఓ గొప్ప నటి బయోపిక్‌ తీస్తాం అంటే… ఆమె భర్త వద్దంటున్నారు. ఏకంగా నేను బతికి ఉండగా ఆమె బయోపిక్ వచ్చే అవకాశమే లేదు అని స్టేట్మెంట్‌ ఇచ్చారు. కారణం ఏంటో తెలిస్తే ఆయనే కరెక్ట్ అని కూడా మీరు అనొచ్చు.

అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) బయోపిక్ వస్తుందా? గత కొన్నేళ్లుగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. అనూహ్యంగా ప్రమాదవశాత్తు మరణించిన ఆమె బయోపిక్‌ వస్తే… నేటి తరానికి ఆమె ఎవరో తెలుస్తుంది అనేది కొంతమంది ఆలోచన. ఇటీవల ఇదే ప్రశ్న ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌కు (Boney Kapoor) ఎదురైంది. దానికి ఆయన ‘‘నేను బతికుండగా నా భార్య బయోపిక్ తీయడానికి అనుమతించను’’ అని క్లారిటీ ఇచ్చేశారు. సినిమాల సంగతి పక్కనపెడితే, వ్యక్తిగతంగా శ్రీదేవి గుంభనంగా ఉండేది.

ఆమె వ్యక్తిగత విషయాల్ని బయట చర్చించలేదు. అలాంటి ఆమెపై బయోపిక్‌ వస్తే సరికాదు. కల్పితాలు జోడిస్తారు. అందుకే బయోపిక్‌ వద్దు అని అన్నారాయన. శ్రీదేవి చాలా ప్రైవేట్ వ్యక్తి.. పర్సనల్‌ లైఫ్‌ ప్రైవేట్‌గా ఉండేలా నిరంతరం జాగ్రత్తలు తీసుకుంది. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత, ఆమె ప్రైవేట్ లైఫ్… పబ్లిక్ ముందుకు రాకూడదు అనుకుంటున్నాను అని అన్నారాయన. అయితే ఆయనే ఆమె బయోపిక్‌ కోసం ముందుకొస్తే… ఇలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా చేసేయొచ్చు అనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది.

మరి దానికి ఏమంటారో చూడాలి. ఆరేళ్ల క్రితం దుబాయిలో బాత్ టబ్‌లో మునిగి శ్రీదేవి చనిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమె మరణంపై ఎన్నో కథనాలు, అనుమానాలు తెరపైకొచ్చాయి. ఒక దశలో బోనీ కపూర్‌ను చాలామంది అనుమానించారు. దీంతో ఇప్పుడు ఆమె బయోపిక్‌ అంటే… ఆ విషయాలు చర్చకు వస్తాయి అని బోనీ అనుకుంటున్నారామో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus