రిలీజ్‌ డేట్‌ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా లేదుగా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల తేదీ విషయంలో ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌, ప్రముఖ దర్శకుడు రాజమౌళి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మాటల యుద్ధం అనే కన్నా… ‘బోనీ’ దండయాత్ర అంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే విమర్శించుకుంటూ వెళ్తున్నారు. రిలీజ్‌ డేట్‌ చెప్పగానే విమర్శించిన బోనీ… మరోసారి నోటికి పని చెప్పారు. ఈ సారి ఏకంగా రాజమౌళి చేసిన పని బెదిరింపు కూడా అనుకోవచ్చు అంటూ ఘాటుగా విమర్శించారు. ఇంతకీ ఏమైందంటే…

వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఇటీవల ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబరు 13న సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీనే బాలీవుడ్‌లో విమర్శల పరంపరకు దారి తీసింది. నిజానికి దసరా కానుకగా బాలీవుడ్‌లో ‘మైదాన్‌’ను విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత బోనీ కపూర్‌ అనుకున్నాడు. ఆ సినిమాకు అక్టోబరు 15 విడుదల తేదీగా ప్రకటించాడు. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆ తర్వాత ప్రకటించారు.

ఈ విషయంలో ఆ రోజే బోనీ కపూర్‌ విరుచుకుపడ్డారు. మేం ముందుగా ‘మైదాన్‌’ గురించి ప్రకటించాం. ఇప్పుడు మీరు ఇలా చేయడం సరికాదు అంటూ విమర్శించారు. తాజాగా మరోసారి మాట్లాడుతూ రాజమౌళి ఇలా తన సినిమాను పోటీకి ఉంచడం బెదిరింపు అవుతుందని విమర్శించారు బోనీ కపూర్‌. ‘‘లాక్ డౌన్ కారణంగా చాలా నష్టపోయాం. మేం విడుదల తేదీ ప్రకటించిన చాలా రోజుల తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ విడుదల ప్రకటించారు. రాజమౌళిని అడిగితే ఈ వ్యవహారంలో తనకేం సంబంధం లేదని, ఇది నిర్మాత నిర్ణయమని అంటున్నాడు. కానీ అది నమ్మేలా లేదు’’ అని బోనీ అన్నారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అజయ్ దేవగణ్‌ నటిస్తున్నాడు. కనీసం ఆయనకు కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్ డేట్ విషయంలో సమాచారం కూడా ఇవ్వలేదు. సినిమా విడుదల తేదీల విషయంలో రాజమౌళి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఇది వెన్నుపోటు చర్య అవుతుంది. వందలాది మంది జీవితాలతో ఆడుకుంటున్నారు’’ అంటూ రాజమౌళిపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బోనీ కపూర్. మరి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ దీనిపై ఏమంటుందో చూడాలి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus