Baadshah Re-Release: ‘బాద్‌షా’ బుకింగ్స్ ఓపెన్ అంటూ బండ్ల గణేష్ ఆనందం..!

ఓ పర్ఫ్యూమ్ యాడ్‌లో చెప్పినట్టు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజుల ట్రెండ్ నడుస్తోంది అని చెప్పొచ్చు.. ఓపక్క సంక్రాంతికి పెద్ద హీరోల మధ్య బీభత్సమైన పోటీ నెలకొంది.. థియేటర్ల కోసం దబిడి దిబిడే అన్నట్టుంది వ్యవహారం.. ఇటీవలే డైరెక్టర్ త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’, రెబల్ స్టార్ ప్రభాస్ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ‘వర్షం’ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది..

వరుసగా ఆరు హిట్లు, డబుల్ హ్యాట్రిక్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న తారక్ అభిమానులకిది కిక్కిచ్చే న్యూస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొద్దిరోజుల ముందు ‘అదుర్స్’ డిజిటల్ వెర్షన్ రెడీ అవుతోందని వార్తలొచ్చాయి.. ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ అవబోతోంది.. ఏకంగా ఆ మూవీ నిర్మాతే బుకింగ్స్ ఓపెన్ అంటూ ట్వీట్ వేయడంతో జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.. ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ తన ఒరిజినల్ నేమ్ నందమూరి తారక రామారావుని క్యారెక్టర్ పేరుగా పెట్టుకోవడంతో పాటు,

తొలిసారి పోలీస్‌గా కనిపించిన యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బా‌ద్‌షా’ చిత్రం రీ రిలీజ్‌కి రంగం సిద్ధమైంది.. నవంబర్ 19న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.. టీవీలో ఎన్నిసార్లు వచ్చినా బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ నవ్వుల పువ్వుల మధ్య చూస్తే ఆ థ్రిల్లే వేరు కదా.. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ‘బాద్‌షా’ 2013 ఏప్రిల్ 5న విడుదలైంది.. అప్పటికి ‘శక్తి’, ‘దమ్ము’ ఫ్లాపులతో ఉన్న తారక్‌కి సాలిడ్ బూస్టప్ ఇచ్చి, బాక్సాఫీస్ బరిలో హిట్‌గా నిలిచింది..

 

సూపర్ స్టార్ మహేష్ ఈ ఫిలింకి నేరేషన్ ఇవ్వడం విశేషం. ముఖ్యంగా తారక్ క్యారెక్టర్లో రెండు డిఫరెంట్ షేడ్స్, పద్మనాభ సింహా పాాత్రలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఎవర్ గ్రీన్ కామెడీ మూవీని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి.. కోన వెంకట్, గోపి మోహన్ ద్వయం కథ, కోన మాటలు, మిగతా నటీనటుల కామెడీ టైమింగ్, సిద్ధార్థ్, నవదీప్‌ల స్పెషల్ అప్పీరియన్సెస్, థమన్ సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బ్యాక్ బోన్‌లా నిలిచాయి.. 9 సంవత్సరాల తర్వాత తెలుగు ప్రేక్షకులను అలరించడానికి నట్టి కుమార్ నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది ‘బాద్‌షా’..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus