పెద్దితో ప్యారడైజ్.. నాని తగ్గుతాడా?

టాలీవుడ్‌లో 2026 మార్చి చివరి వారం బాక్సాఫీస్‌కి అసలైన పరీక్షగా మారబోతోంది. ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది(Peddi) రిలీజ్ అవుతున్నా, మరోవైపు నేచురల్ స్టార్ నాని(Nani) తన కొత్త సినిమా ప్యారడైజ్తో (The Paradise)  అదే వీకెండ్‌లో థియేటర్లలో సందడి చేయనున్నాడు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ది మూవీ కోసం ఫస్ట్ షాట్ గ్లింప్స్ విడుదల కాగా, రామ్ చరణ్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Nani, Ram Charan:

బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి విడుదల తేదీగా 2026 మార్చి 27ని ఫిక్స్ చేశారు. చరణ్ బర్త్‌డే కానుకగా సినిమాను రిలీజ్ చేయడమే మేకర్స్ లక్ష్యం. ఇది శుక్రవారం కావడం, వెకెండ్ కొనసాగడం సినిమాకు అడ్వాంటేజ్. అదే సమయంలో నాని ప్యారడైజ్ చిత్రం కూడా 2026 మార్చి 26న విడుదల కాబోతుంది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ఇప్పటికే ఇంటెన్స్ బజ్ క్రియేట్ చేశాయి.

కానీ పక్కనే పెద్ది లాంటి భారీ ప్రాజెక్ట్ ఉండడంతో, ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు చర్చ నడుస్తోంది.. నాని తన రిలీజ్ డేట్ మార్చుతాడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. నాని గతంలో తన సినిమాల విషయంలో చాలా ప్లానింగ్‌తో ముందడుగు వేస్తూ వచ్చారు. బాక్సాఫీస్‌కి పోటీగా వచ్చేది అయితే తక్షణమే డేట్ మార్చే వ్యక్తిత్వం అతనిది. అందుకే ఇప్పుడే ప్యారడైజ్ మేకర్స్ ఆలోచనలో పడ్డారని టాక్. ఈ కాంపిటీషన్‌ను తప్పించుకోవడం ద్వారా వసూళ్ల పరంగా లాభదాయక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

అయితే నాని కూడా ఇప్పుడు పెద్ద లీగ్‌లో ఉన్న హీరో. పుష్ చేసి రిలీజ్ చేసినా తన మార్కెట్ మీద నమ్మకంతో ముందుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఇకపోతే ఇంకా ఏ ఏడాది సమయం ఉన్నందున, సన్నివేశాలు మారే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతం పెద్ది vs ప్యారడైజ్ అనే వార్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రిలీజ్ క్లాష్ చివరకు ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.

ఆ సినిమాకి వేలల్లోనే పారితోషికం.. షాక్ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus