Akhanda 2: ‘అఖండ’ వాటన్నింటికి అతీతుడు.. ఏమైనా చేయగలడు.. బోయపాటి క్లారిటీ

మీ హీమ్యాన్‌, స్పైడర్‌ మ్యాన్‌, థోర్‌ లాంటివాళ్లు ఉన్నారు.. మాకు మా బాలయ్య ఒకడు చాలు.. ఈ మాట చెప్పుకుంటూ ఫ్యాన్స్‌, న్యూట్రల్‌ ప్రేక్షకులు మురిసిపోతుంటారు. దానికి కారణం ఆయన చేసే లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌ పాత్రలు, ఆ పాత్రలు చేసేటప్పుడు చేసే కొన్ని ఫీట్లు. ఆయనే చేయిస్తారో లేక దర్శకరచయితలు అలా రాస్తారో తెలియదు కానీ.. బాలకృష్ణ సినిమాల్లో ఇలాంటివి సీన్స్‌, ఎలివేషన్స్‌ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ‘అఖండ 2 : తాండవం’ సినిమాలో కూడా అదే జరిగింది. మానవమాత్రుడు కలలో కూడా చేయలేని ఎన్నో ఫీట్లు బాలయ్య చేసి వావ్‌ అనిపించాడు.

Akhanda 2

దీంతో బాలయ్యను ట్రోల్‌ చేసే బ్యాచ్‌కి మళ్లీ ఊపిరొచ్చింది. బాలయ్యకు మాత్రమే సాధ్యం అనికొందరు.. బోయ మ్యాజిక్‌ అంటూ మరికొందరు ట్రోల్‌ చేస్తున్నారు. ఫ్యాన్స్‌ అయితే ఎవరేం అనుకుంటే మాకేంటి.. మా హీరో ఏం చేసినా మాకు ఓకే అని ఆ సీన్స్‌ ఇచ్చిన హైతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. వారికి మరింత బూస్టింగ్‌ ఇచ్చేలా దర్శకుడు బోయపాటి శ్రీను మాటలు ఉన్నాయి. సినిమా విడుదలైన సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌ ‘చెప్పామా మేం చెప్పామా’ అంటూ రిపీట్‌ చేస్తున్నారు.

బోయపాటి సినిమాలంటే లాజిక్కులు ఉండవని, యాక్షన్ సీన్స్‌లో అతి ఎక్కువగా ఉంటుందని ఓ అంచనా వేసుకొనే థియేటర్లకు వెళ్తుంటారు ప్రేక్షకులు. అయితే ‘అఖండ 2: తాండవం’ సినిమాలో ఆ అతి మతి పోయే రేంజిలో ఉంది. ఇదే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తే.. అఖండ అష్టసిద్ధి సాధించినవాడు. అష్ట దిగ్బంధనానికి వెళ్లిపోయి 12 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చినవాడు. అతనొక సూపర్ హీరో అని అన్నారు. అసలు అలాంటి వాళ్లకు లాజిక్‌, మ్యాజిక్‌ అనేది ఉండదు అని చెప్పారాయన.

అఖండ లాంటివాళ్లు నానో ఆకారానికి వెళ్లగలరు. అలాగే విశ్వరూపం చూపించగలరు. కానీ ఈ సినిమా మేం అక్కడి వరకు వెళ్లలేదు. ఇప్పుడది కరెక్ట్ కాదులే అని చూపించలేదు. ఆయుధంతో మాత్రమే గేమ్ ఆడాం. సూపర్ హీరో అనేవాడు టైమ్‌ బట్టి, సిట్యువేషన్‌ని బట్టి ఏ విధంగా అయినా మారిపోతాడు. ఏది చేసినా సరే సూపర్‌ హీరోకు లాజిక్‌ ఉండదు. అందుకే అష్టసిద్ధి సాధకుడు అనే విషయాన్ని సినిమా మొదట్లో చెప్పేశాం అని బోయపాటి క్లారిటీ ఇచ్చారు.

అంతన్నారు.. ఇంతన్నారు.. ఆది పినిశెట్టిని ఇలా చేసేశారేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus