Aadhi Pinishetty: అంతన్నారు.. ఇంతన్నారు.. ఆది పినిశెట్టిని ఇలా చేసేశారేంటి?

సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు, అందులోని పాత్రలను అనౌన్స్‌ చేసినప్పుడు ఉండే హై.. ఆ తర్వాత సినిమాలో ఆ పాత్రను చూసినప్పుడు లేకపోతే కచ్చితంగా ఆ నటుడికి ఇబ్బందిగా ఉంటుంది. అతని ఫ్యాన్స్‌కి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు ఆది పినిశెట్టి అభిమానులకు, అతనికి కూడా ఇదే ఫీలింగ్‌ అనిపిస్తోంది. దీనికి కారణం ‘అఖండ 2’ సినిమానే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ సినిమాలో ఆది పాత్ర గురించి చెప్పేటప్పుడు తొలి రోజుల నుండి సినిమా టీమ్‌ భారీ ఎలివేషన్లు ఇచ్చింది. అందుకు తగ్గట్టే సినిమా టీజర్‌, ట్రైలర్లలో చూపించారు కూడా. కానీ సినిమా దగ్గరకు వచ్చేసరికి అలాంటి మ్యాజిక్‌ ఏమీ కనిపించలేదు.

Aadhi Pinishetty

అవును, మీరు చదివింది నిజమే. సినిమా చూసినవాళ్లకు ఈ విషయం ఇప్పటికే తెలిసి ఉంటుంది. చూడని వాళ్లకు మాత్రం అవునా అనిపిస్తుంది. ఎందుకంటే మంచి నటుడిగా పేరున్న ఆది పినిశెట్టిని ఓ మూడు, నాలుగు సీన్ల కోసం వాడేశారు. ఆ తర్వాత సైడ్‌ చేసేశారు. చూపించిన కాసేపు క్రూరత్వం అర్థమయ్యేలా చేయడానికి ఏదోలా పాత్రను డిజైన్‌ చేశారు. దీంతో ఏంటిది ఆదిని ఇలా చేసేశారు అని అభిమానులు నిరాశపడ్డారు.

‘అఖండ 2’ సినిమాలో ఆది పినిశెట్టి మాంత్రికుడు నేత్రగా కనిపిస్తాడు. చేతబడులు చేసే పాత్రలో డిఫరెంట్‌గా లుక్‌ ట్రై చేశాడు. అయితే మెయిన్ విలన్‌ మాత్రం కాదు. వారికి సహాయం చేసే ఓ చిన్న విలన్‌. కనిపించినంతసేపు ఆది అదరగొట్టినా ‘ఇది సరిపోదు’ అనే ఫీలింగ్‌ సినిమా అభిమానికి కలుగుతుంది. ఎందుకంటే అతని నుండి ఇంకొంత రాబట్టొచ్చు అనే ఫీలింగ్‌ ప్రేక్షకులకు కలగడమే. కుదిరితే మెయిన్‌ విలన్‌ ఇవ్వాల్సింది అని కూడా అనిపిస్తుంది.

కానీ, దర్శకుడు బోయపాటి శ్రీను రాసుకున్న కథ ప్రకారం ఆది పాత్రకు అంతకుమించిన అవకాశం లేదు. అయితే ఆది పాత్ర క్రూరంగా ఉంటుందని, అదిరిపోతుందని అతని పీఆర్‌ టీమ్‌, సినిమా పీఆర్‌ టీమ్‌ ఉపయోగం లేని లీకులు ఇచ్చింది. ఇప్పుడు అవే ఇబ్బందికరంగా మారాయి. అంచనాలు పెంచేసుకొని థియేటర్లకు వెళ్లి చూస్తే ఇలాంటి చిన్న పాత్ర చూపించడం సరికాదు కదా. ఇప్పుడు అదే జరిగింది. అయితే ఆదికి తొలుత పెద్ద పాత్రే అనుకున్నారని.. కానీ కథ, కథనం మారడంతో ఈ పాత్ర చిన్నదైపోయింది అనే వాదన కూడా ఉంది.

భాగ్యశ్రీకి హీరోలు కలసి రాలేదు.. ‘హీరో’యిన్‌ కలిసొస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus