Boyapati Srinu: ఎలా పడితే అలా నేను తీయను.. బోయపాటి కామెంట్స్ వైరల్!

  • October 9, 2023 / 10:29 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చే దర్శకులలో బోయపాటి శ్రీను ముందువరసలో ఉంటారు. బోయపాటి శ్రీను సినిమాల బడ్జెట్లు కూడా భారీ రేంజ్ లో ఉంటాయి. బోయపాటి శ్రీను సినిమాలు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఆ సినిమాలలో కొన్ని సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. తాజాగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ 100 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో నేను సినిమా చేయలేనని తెలిపారు.

ఇది క్లియర్ అని ఆయన అన్నారు. అవసరమైతే ఇంట్లో కూర్చుని కథలు రాసుకుంటాను తప్ప ఎలా పడితే అలా నేను టచ్ చేయనని బోయపాటి శ్రీను అన్నారు. నా పేరు విని మంచి సినిమా తీస్తానని చూసే అభిమానులు ఉన్నారని బోయపాటి శ్రీను కామెంట్లు చేయడం గమనార్హం. నా సినిమాలకు 100 కోట్ల రూపాయల కంటే తక్కువ ఖర్చు కాదని నా సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని బోయపాటి శ్రీను తెలిపారు.

4, 5 రోజుల్లో యాక్షన్ సీక్వెన్స్ లను తీయడం నా వల్ల కాదని బోయపాటి శ్రీను కామెంట్లు చేశారు. స్కంద ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ లో రామ్ చేశారని డూప్ లేడని ఆయన తెలిపారు. బోయపాటి శ్రీను సినిమాలన్నీ భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. బోయపాటి శ్రీను రాబోయే రోజుల్లో మరిన్ని భారీ ప్రాజెక్ట్ లను తెరకెక్కించి భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్టార్ హీరోలతో బోయపాటి శ్రీను భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో బోయపాటి శ్రీను (Boyapati Srinu) విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సినిమా సినిమాకు బోయపాటి శ్రీను మార్కెట్ పెరుగుతోంది.a

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus