Skanda: ఇన్నేసి తప్పులు పెట్టుకుని… మళ్లీ సమర్థింపా? ఇలా అయితే ఎలా బోయపాటి గారు?

బోయపాటి శ్రీనివాస్‌… టాలీవుడ్‌లో మాస్‌ సినిమాలను ఊరమాస్‌ సినిమాలుగా తీయడంలో సిద్ధహస్తుడు. ఆయన కథ చెప్పడంలోనూ, సినిమా తీయడంలోనూ, జనాలకు చేరవేడయంలోనూ ఓ మాస్‌ ఫీల్‌ ఉంటుంది. అందుకే ఆయన సినిమా వస్తోంది అంటే మాస్‌ సినిమాల ప్రియులు సిద్ధంగా ఉంటారు. అయితే ఆయన సినిమాలు చూడాలన్నా, ఎంజాయ్‌ చేయాలన్నా లాజిక్‌లు వదిలేయాలి? కేవలం మ్యాజిక్‌లు మాత్రమే నమ్ముకోవాలి. ఒకవేళ కుదరదు అంటే ఆయన స్టైల్‌ సమర్థింపులతో అది నిజమే అని చెబుతుంటారు.

రామ్‌ హీరోగా బోయపాటి తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’. రామ్‌ ద్విపాత్రాభియం చేసిన ఈ సినిమా థియేటర్లలో రన్‌ను ఓ మోస్తరుగా పూర్తి చేసుకుని ఓటీటీల్లోకి వచ్చేసింది. బాలకృష్ణ స్టైల్‌ కథలో రామ్‌ను చూసి ఇలా ఉన్నాడేంటి? ఇలా ఉందేంటి అంటూనే సినిమా చూసేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలో వదిలేసిన లాజిక్‌, తప్పులు చూసి ‘బోయపాటి సినిమా కదా ఇలాంటివి కామన్‌’ అనేసుకుంటున్నారు. ఎప్పటిలానే లాజిక్ లెస్ సీన్లు, అతి ప్రదర్శించే యాక్ష‌న్ ఎపిసోడ్లు, ఎటో వెళ్లిపోయే కథ, కథనమే దీనికి కారణం.

‘స్కంద’ (Skanda) సినిమా వచ్చిన తర్వాత బోయపాటి పెద్దగా బయట కనిపించింది లేదు. సినిమా రిలీజ్‌ అయిన వెంటనే ఒకటో, రెండు సార్లే వచ్చారు. ఇప్పుడు ఓటీటీకి వచ్చిన సందర్భంగా ఆయన పేరును సోషల్‌ మీడియాలో తెగ వాడేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైపు హీరో చేతిలో చావు దెబ్బలు తిన్న వ్యక్తి… మరోవైపు ఆ సీన్‌ను స్క్రీన్‌ మీద చూస్తున్న గ్రూపులో ఉండటం, పొలిటిక‌ల్ సైన్స్ క్లాసులో ఉండే స్టూడెంట్‌ల చేతిలో వేరే సబ్జెక్ట్‌ పుస్తకాలు ఉండటం లాంటి సీన్లు చాలానే ఉన్నాయి.

మనుషుల్ని నరకడం అంటే అరటి చెట్లను నరికినంత ఈజీగా చూపించేయడం, ఇద్దరు హీరోలను పరిచయం చేసే సన్నివేశం, క్లైమాక్స్‌లో సయి మంజ్రేకర్‌ తలకు కట్టు జుట్టుపైనే ఉండటం లాంటి సన్నివేశాలు చూసి.. ఆ ఫైట్స్‌, అరుపులు మీద పెట్టే శ్రద్ధ.. ఈ పాయింట్ల మీద పెడితే బాగుండు అని నెటిజన్లు జోకులేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus