Boyapati Srinu: అఖండ సినిమాతో బోయపాటికి వచ్చింది ఎంత?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది అత్యధిక స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందించిన సినిమా అఖండ. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ హ్యాట్రిక్ సినిమా మొత్తానికి అందరికీ మంచి లాభాలను అందించింది. ఇక నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమా బడ్జెట్ విషయంలో మొదట చాలా ఆందోళన చెందుతున్నట్లు టాక్ వచ్చింది. చాలా సందర్భంలో దర్శకుడితో కూడా చర్చలు కూడా జరిగాయని కొన్ని వాదోపవాదాలు కూడా కొనసాగినట్లు కథనాలు వెలువడ్డాయి.

కరోనా సమయంలోనే సినిమా బడ్జెట్ మరింత ఎక్కువ అవుతుంటే.. కంట్రోల్ చేసేందుకు బాలకృష్ణ కూడా ఆ మధ్య బోయపాటితో చర్చలు జరిపినట్లు టాక్ వచ్చింది. ఏదేమైనా దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం తను అనుకున్న విజన్ రావాలి అని తన రెమ్యూనరేషన్ ను కూడా త్యాగం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే మొత్తానికి సినిమాకు విడుదల తరువాత బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడంతో దర్శకుడు బోయపాటి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అసలైతే బోయపాటి శ్రీనివాస్ 9 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉండేదట. అయితే బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ కావడంతో సగం వరకు దర్శకుడు పారితోషికం తీసుకోకుండా సినిమా చేశాడట. అయితే సినిమా సక్సెస్ అయితే లాభం తీసుకునేందుకు కూడా ముందే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా మొత్తానికి మంచి ఆదాయాన్ని అందించడంతో దర్శకుడు బోయపాటి 15 కోట్లకు పైగానే లాభం అందుకున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా అనుకున్న దాని కంటే ఈ దర్శకుడికి ఎక్కువగానే ఆదాయం వచ్చినట్లుగా సమాచారం.

ఇక బోయపాటి శ్రీనివాస్ తన తదుపరి ప్రాజెక్టును ఎవరితో చేస్తారు అనేది కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అంటూ అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మరి దర్శకుడు ఏ హీరోతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus