రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’ చిత్రం జూలై 15న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది.కానీ మొదటి రోజు ఈ చిత్రం కలెక్షన్లు బాగానే వచ్చాయి. టాక్ ఎఫెక్ట్ వల్ల రెండు, మూడు, నాలుగు రోజుల్లో కలెక్షన్లు తగ్గినప్పటికీ పర్వాలేదు అనిపించింది. కానీ ఈరోజు అంటే మొదటి సోమవారం నాడు ఈ మూవీ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ దారుణంగా ఉంది. ఈ మావీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో రూ.20 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.
కానీ అది కష్టమగానే కనిపిస్తుంది. మాస్ సెంటర్స్ లో ఈ చిత్రం పర్వాలేదు అనిపిస్తున్నా.. ఎ సెంటర్ ఆడియన్స్ ఈ మూవీని పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టమవుతుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ది వారియర్’ థియేట్రికల్ రన్ ముగిసేసరికి బయ్యర్స్ కు రూ.15 కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
అయితే అందులో 20 శాతం ప్రొడక్షన్ టీం చెల్లిస్తుందని.. బ్యాలన్స్ మొత్తం రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం థియేట్రికల్ హక్కులతో కవర్ చేస్తామని నిర్మాతలు హామీ ఇచ్చినట్లు టాక్. బోయపాటి శ్రీను సినిమా అంటే మినిమం గ్యారెంటీ. ఆయన ఏ నిర్మాతతో సినిమా చేసినా భారీ లాభాలు అందిస్తూ ఉంటాడు.
బోయపాటి – రామ్ కాంబినేషన్లో రూపొందనున్న మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో నిర్మాతలకు అదో ధైర్యం అనుకోవాలి. నిజానికి ‘ది వారియర్’ బిజినెస్ ఎక్కువ జరగడానికి బోయపాటితో రామ్ చేస్తున్న మూవీ వల్లనే అనే టాక్ కూడా వినిపించింది. కాబట్టి ఇప్పుడు ‘ది వారియర్’ నష్టాలు బోయపాటి మూవీతోనే తీరాలన్న మాట.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!