అజర్ బైజాన్ లో షూటింగ్ ప్లాన్ చేసిన బోయపాటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొన్నటి వరకు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ని ఐరోపాలో ప్లాన్ చేశారు. అక్కడి “అజర్ బైజాన్” అనే ప్రాంతంలో 30 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. అక్కడ ఇది వరకు ఏ తెలుగు చిత్రం షూటింగ్ జరుపుకోలేదు. అటువంటి ప్రదేశంలో షూటింగ్ వెనుక బలమైన కారణం ఉందని అంటున్నారు.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. రాజవంశస్థుల నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాలో రామ్ చరణ్ కి అన్నయ్యలుగా తమిళ హీరో ప్రశాంత్‌, నవీన్‌ చంద్ర, ఆర్యన్ రాజేష్ నటిస్తున్నారు. చెర్రీ కి వదినలుగా అలనాటి హీరోయిన్ స్నేహ, అనన్య (‘జర్నీ’ ఫేం), హిమజలు కనిపించనున్నారు. విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఓబరాయ్ పోటీపడుతున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus