#BoycottRRRinKarnataka: ఆర్ఆర్ఆర్ విషయంలో కన్నడ ప్రేక్షకుల ఆగ్రహం.. బాయ్‌కాట్!

ఏదైనా పెద్ద సినిమా విడుదలైనప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడం కామన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో కూడా బాయ్‌కాట్ అంటూ ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా అదే తరహా చేదు అనుభవం ఎదురవుతోంది. కర్ణాటకలో ఈ సినిమాను బాయ్‌కాట్ చేయండి అంటూ #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ మారుమ్రోగి పోయేలా చేస్తున్నారు. ఇక ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయంలోకి వెళితే..

Click Here To Watch NEW Trailer

ఆర్ఆర్ఆర్ సినిమా కర్ణాటకలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు అక్కడ స్టార్ హీరోల రేంజిలో ఆర్ఆర్ఆర్ సినిమా కర్ణాటక ఇండస్ట్రీలో విడుదలవుతోంది. అయితే ఆ స్థాయిలో విడుదల అవున్నప్పటికీ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కన్నడ భాషల్లో విడుదల చేయకుండా తెలుగు భాషలోనే ఎక్కువగా విడుదల చేస్తున్నారు. ఈ విషయంలో కన్నడ ప్రేక్షకులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక లో జరిగిన ఈవెంట్ లో కూడా కన్నడ హీరో శివ రాజ్ కుమార్ కూడా ఈ సినిమాను కన్నడలో విడుదల చేయాలి అని రిక్వెస్ట్ చేశారు.

అయినప్పటికీ రాజమౌళిని ఆ విషయాన్ని లెక్కచేయకుండా తెలుగులోనే ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాడు అని అక్కడ అభిమానులు మండిపడుతున్నారు.. ఆర్ఆర్ఆర్ సినిమాను బాయ్‌కాట్ చేస్తున్నాము అంటూ సోషల్ మీడియాలో #BoycottRRRinKarnataka ట్యాగ్ ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. గతంలో కూడా బాహుబలి సినిమాకు కూడా ఇదే తరహాలో కన్నడ ప్రేక్షకులు రియాక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు కూడా అదే తరహాలో రియాక్ట్ అవుతున్నారు. దీంతో తెలుగు నెటిజన్స్ కూడా కేజిఎఫ్ 2 సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది అని ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అని అంటున్నారు.

ఇక అందుకు కౌంటర్ గా మరికొంతమంది కన్నడ నెటిజన్లు కేజిఎఫ్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో తెలుగులోనే రిలీజ్ అవుతుంది అని.. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాను ఇలా ఎందుకు రిలీజ్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఈ తరహా నిర్ణయం రాజమౌళి చెతిలో ఉండదు అని కేవలం ఆ నిర్ణయం డిస్ట్రిబ్యూటర్ చేతుల్లోనే ఉంటుంది అని మరికొందరు చెబుతున్నారు. మరి ఈ విషయంలో రాజమౌళి ఏదైనా నిర్ణయం తీసుకుంటాడో లేదో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus