మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా.. కె.ఎస్.రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’.. కేథరిన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనుంది.. ‘మాస్ మహారాజా’ రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ అనే పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేశాడు.. ఆదివారం (జనవరి 8)న విశాఖపట్టణంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.. ట్రైలర్ మూవీ మీద అంచనాలు పెంచేసింది..
చాలా రోజల తర్వాత ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్లో మెగాస్టార్ మెస్మరైజ్ చేయనున్నారని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకాభిమానులు.. సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ భారీ స్థాయిలో విడుదల కానుంది.. ‘ఖైదీ నెం:150’ తర్వాత సంక్రాంతి సీజన్‌లో వస్తోన్న మెగాస్టార్ సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ ఓ కొత్త వివాదంలో చిక్కుకుంది.. ఏదైనా ఓ చిన్న విషయాన్ని రచ్చ రచ్చ చేసే నెటిజన్లు, యాంటీ ఫ్యాన్స్ దొరికిందే ఇది అన్నట్టు ఏకంగా ‘బాయ్‌కాట్ వాల్తేరు వీరయ్య’ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు..
అసలేం జరిగిందో వివరంగా చూద్దాం.. ‘వాల్తేరు వీరయ్య’ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి పడవ మీద నిలబడి తన స్టైల్లో బీడి కాలుస్తుంటారు.. అయితే పడవ మీద చిరు ఇష్టదైవమైన ఆంజనేయుడి ఫోటోతో కూడిన జెండా ఉంటుంది.. అయితే ‘‘హనుమంతుడి జెండా పక్కన నిలబడి బీడీ కాల్చడం ఏంటి?.. ఇది దేవుడిని అవమానించినట్టే కదా’’.. అని ప్రశ్నిస్తూ ‘బాయ్‌కాట్ వాల్తేరు వీరయ్య’ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.. ‘‘స్వతాహా చిరు ఆంజనేయ స్వామి భక్తుడు..
పలుసార్లు హనుమాన్ దీక్ష కూడా తీసుకున్నారు.. ఆంజనేయుడి మీద అభిమానంతో జెండా పెట్టుకుని ఉండొచ్చ కానీ కావాలని ఎవరూ అలా చెయ్యరు కదా’’ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.. మరి చిరంజీవి కానీ డైరెక్టర్ బాబీ కానీ ఈ విషయం గురించి ఎలా స్పందిస్తారో చూడాలి..