‘#బాయ్స్’ చిత్ర నిర్మాత మిత్ర శర్మ హాట్ ఫోటో షూట్ కు అనూహ్య స్పందన..

శ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా #బాయ్స్. సన్నీ లియోన్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్పటి వరకు విడుదలైన పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విభిన్నమైన పద్దతిలో విడుదల చేశారు మేకర్స్. ఆంధ్ర, తెలంగాణ నుంచి 100 మంది కామన్ పీపుల్‌ను ఎంపిక చేసి.. వాళ్లకు రోజూ 10 వేలు, 5 వేలు, 3 వేలు చొప్పున క్యాష్ ప్రైజ్ ఇచ్చారు బాయ్స్ చిత్ర యూనిట్. ‘Common Man is Our Celebrity’ కాన్సెప్టుతో సినిమాను ప్రమోట్ చేశారు.

ఈ సినిమా నిర్మాత, హీరోయిన్ మిత్ర శర్మ తాజాగా ఒక హాట్ ఫోటో షూట్ విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్స్ చాలా అరుదుగా ఉన్నారు. అందులో డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ప్రొడ్యూసర్ గా మిత్ర శర్మ తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ బ్యానర్ లో మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. #బాయ్స్ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నారు మిత్ర శర్మ. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈమె ఫోటో షూట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు దర్శక నిర్మాతలు.

1

2

3

4

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus